Sunday, September 8, 2024

తొలి ప్రసంగంతోనే సిక్సర్ జగన్ సర్కార్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు

- Advertisement -

సై అంటే సై

తొలి ప్రసంగంతోనే సిక్సర్
జగన్ సర్కార్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు

సరికొత్త రాజకీయం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల

వైసీపీ శిబిరంలో మొదలైన టెన్షన్

గుంటూరు
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రాజకీయ పోకడ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయమే. ముక్కుసూటిగా, కుండబద్ధలు కొట్టినట్టుగా అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో ఆమెకు ఆమే సాటి. పార్టీ సిద్ధాంతాన్ని, వైఖరిని ధైర్యంగా జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆమె స్టైలే ప్రత్యేకం. తెలంగాణలో కేసీఆర్‌ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఆమె సవాలు చేశారు. ముక్కుసూటిగా, కుండబద్ధలు కొట్టినట్టుగా అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో ఆమెకు ఆమే సాటి. పార్టీ సిద్ధాంతాన్ని, వైఖరిని ధైర్యంగా జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆమె స్టైలే ప్రత్యేకం. తెలంగాణలో కేసీఆర్‌ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఆమె సవాలు చేశారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసిరారు. ఇక అన్న జగన్ అవినీతి కేసులో జైళ్లో ఉన్నప్పుడు పార్టీని ఆమె ఏవిధంగా బతికించారో కూడా అందరికీ తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాక కూడా ఆమె రాజకీయ శైలిలో ఎలాంటి అదురుబెదురు కనిపించడం లేదు. సుస్పష్టమైన రాజకీయ వైఖరిని ఆమె కనబర్చుతున్నారు. సీఎం సీటులో సొంత అన్న కూర్చున్నప్పటికీ ఆమె కచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత అన్న సారధ్యంలోని వైసీపీ సర్కారుకు షర్మిల బాణం ఎక్కుపెట్టారు. తన ప్రసంగాలతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వైసీపీ మైనస్ పాయింట్లపై గురి చూసి కొడుతున్నారు. మాటలతో బలంగా దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ బలోపేతం లక్ష్యంగా జిల్లాల పర్యటన ఆరంభించిన షర్మిల తొలిరోజే జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. తన మార్క్ స్టైల్‌లో ఆర్టీసీ బస్సులో ఇచ్చాపురం చేరుకున్నారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు బస్సులోనే ప్రయాణించి సామాన్య ప్రయాణికులతో మాట్లాడి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఇచ్చాపురంలో మాట్లాడుతూ వైసీపీ సర్కారు నోర మెదపలేని స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ గెలిచినా బీజేపీ రాజ్యమేలుతోందని విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీతో వైసీపీ ప్రభుత్వం అంటకాగుతోందని మండిపడ్డారు. ఒక్క విషయంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు. బీజేపీతో దోస్తీ, ప్రత్యేక హోదా విషయంలో జగన్ సర్కార్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని షర్మిల గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నియంత పాలన సాగుతోందని వైఎస్ జగన్‌పై బలమైన దాడి చేశారు. షర్మిల విరుచుకుపడుతున్న తీరుకు వైసీపీ పెద్దలు వణికిపోతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ శిబిరంలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పార్టీలో అసంతృప్త జ్వాలలు, వలసలు కొనసాగుతున్న వేళ షర్మిల ఎంట్రీ వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు , నారా లోకేశ్, పవన్ కల్యాణ్ తో పాటు తాజాగా వారికి షర్మిల తోడవ్వడంతో ఉలిక్కిపడుతున్నారు. ఎన్నికల ముందు షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఏమైనా నష్టం జరుగుతుందా అని కంగారుపడుతున్నారు. మరి సొంత చెల్లి షర్మిలను ఎదుర్కొనే విషయంలో సీఎం జగన్, వైసీపీ పెద్దలు ఎలాంటి వ్యూహాలను రచిస్తారో వేచిచూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్