- Advertisement -
చిన్న కాళేలేశ్వరం కెనాల్ పనులను అడ్డుకున్న రైతులు
Small Kaleleshwaram canal works blocked by farmers
జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం లో నిర్వహిస్తున్న చిన్న కాలేశ్వరం గ్రావిటీ కెనాల్ పనులను రైతులు నాలుగో రోజు అడ్డుకున్నారుదీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం
చోటుచేసుకుంది. జెసిబి ద్వారా కెనాల్ తోడే క్రమంలో జెసిబి ముందు పడుకొని నిరసన తెలిపారు. రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పోలీసుల పహారా పెట్టి పనులను నిర్వహిస్తున్నారు. పోలీసులు పొలాల్లో భారీగా
మోహరించారు. ఎలికేశ్వరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించడంతో రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది….
అధికారులు మాత్రం గతంలోనే సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించామని చెబుతున్నారు. రైతులు మాత్రం గత సర్వే ఇప్పటి సర్వేకు చాలా తేడా ఉందని అంటున్నారు. అన్యాయంగా మా భూములను
రాక్కుంటున్నారని ఆవేదన చెందారు. .
- Advertisement -