సోషల్ మీడియా ఫేమ్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి
Social media fame ‘Aggipetti Maccha’ passes away.
తిరుపతి : సోషల్ మీడియాలో ‘అగ్గిపెట్టి మచ్చ’గా గుర్తింపు పొందిన కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. ఆయన మృతితో సోషల్ మీడియా వర్గాల్లో విషాదం నెలకొంది.
. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యూట్యూబ్ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను అలరించిన కిరణ్ కుమార్.. ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కామెడీ వీడియోలు, వినోదాత్మక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
కిరణ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. పలువురు యూట్యూబర్లు, కళాకారులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు




