Wednesday, March 4, 2026

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించండి— బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

- Advertisement -

బషీర్బాగ్ : నవంబర్ 30 ( వాయిస్ టుడే )

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించండి
▪️సీఎంఆర్ ఇచ్చాక ఢీపాల్ట్ ఎందుకో…!
▪️సీఎంఆర్ ఇచ్చిన రెండేళ్ల తర్వాత 25 శాతం పెనాల్టీ.. 12 శాతం వడ్డీ కట్టమంటారా?
▪️ముందుగా ఇస్తామని.‌. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని తర్వాత అడ్డుచెప్పడంలో ఆంతర్యమేంటి?
▪️మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు సమాధానం చెప్పాలి
— బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

Solve the problems of rice millers–

రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆదివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రైస్ మిల్లర్ల సమస్యలపై మాట్లాడారు.

మొత్తం సీఎంఆర్ అప్పగించిన కూడా రాష్ట్రంలో దాదాపు 400 మందికి, వనపర్తి జిల్లాలో 36 మంది రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించకుండా సివిల్ సప్లయ్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

అప్పుడేమో కెపాసిటీకి మించి కేటాయింపులు చేశారని… ఆలస్యమైనా మొత్తం సీఎంఆర్ ఆప్పగించారని, సీఎంఆర్ ఇచ్చాక ఢీపాల్ట్ ఎందుకో సివిల్ సప్లయ్ అధికారులు చెప్పాలన్నారు.

సీఎంఆర్ ఇచ్చిన రెండేళ్ల తర్వాత 25 శాతం పెనాల్టీ.. 12 శాతం వడ్డీ ఏ లెక్కన కట్టమంటారని ప్రశ్నించారు.

అప్పుడే పెనాల్టీ వేయక.. రెండేళ్లు ఆగి పెనాల్టీ వేయడమే గాక…దానిపై ఈరోజు వరకు వడ్డీ చెల్లించమనడం ఏంటో అర్ధం కావడం లేదని వాపోయారు.

సీఎంఆర్ ఇవ్వకపోతే ఢీపాల్ట్ పెట్టాలి.. కానీ ఇచ్చాక పెట్టడం సరికాదన్నారు.

ముందుగా ధాన్యం ఇస్తామని.‌. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని తర్వాత అడ్డుచెప్పడంలో ఆంతర్యమేంటో…ఎవరి బొక్కసాలు నింపుకోవడానికి ధాన్యం ఇవ్వడం లేదో పౌరసరఫరాల శాఖ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం కూడా మిల్లర్లకు 2018 నుంచి మిల్లింగ్ చార్జెస్ ఇవ్వడం లేదని, ఒక్కో మిల్లరుకు దాదాపు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బకాయిలు ఉన్నదని, మరి వాటికి కూడా ప్రభుత్వం ఫెనాల్టీ, వడ్డీ కట్టిస్తుందా అని ప్రశ్నించారు.

ఈ విషయమై సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారిని కలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు బడేసాబ్, నీలం వెంకటేష్,రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్