33.3 C
New York
Tuesday, July 16, 2024

కొంత మంది పోలీసు అధికారులు వైసిపి కి తొత్తులుగా పని చేశారు                ఎపి హోంమంత్రి వంగలపూడి అనిత

- Advertisement -

కొంత మంది పోలీసు అధికారులు వైసిపి కి తొత్తులుగా పని చేశారు
               ఎపి హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి జూన్ ;: గత ప్రభుత్వంలో కొంత మంది పోలీసు అధికారులు వైసిపి నాయకులకు తొత్తులుగా పని చేశారని ఎపి హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆ అధికారుల్లో వైసిపి రక్తం ప్రవహించినట్లుగా వ్యవహరించారని, జగన్‌పై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసే వెళ్లోచ్చని అనిత సూచించారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో ఎవరు తప్పుచేసినా వదలమని హెచ్చరించారుసింహాచలం దేవస్థానం భూములు అన్యాక్రాంతం కావడానికి వీలు లేదని, పంచగ్రామాల భూసమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని అనిత స్పష్టం చేశారు.  ఎపి ప్రజలకు మంచి జరగాలని సింహాద్రి అప్పనన్నస్వామిని కోరుకున్నానని పేర్కొన్నారు. సింహాచలంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!