త్వరలో ప్రజాక్షేత్రం లోకి నారా ఫ్యామిలీ

- Advertisement -

త్వరలో ప్రజాక్షేత్రం లోకి నారా ఫ్యామిలీ
అమరావతి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానుంది. – కొత్త సంవత్సరంలో భారీ రూట్ మ్యాప్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.  ఈ నెల 5 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు వండబోతున్నాయి. – 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తారు.  కనిగిరిలో చంద్రబాబు తొలి బహిరంగ సభ ప్రారంభం కానుంది.  ప్రతి సభకు లక్ష మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  సంక్రాంతి వరకు మంగళగిరిలో విస్తృతంగా లోకేష్ పర్యటన వుంటుంది.  మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్  ఇంటింటికి వెళతారు. నారా భువనేశ్వరి కుడా ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.   నిజం గెలవాలి పేరుతో బుధవారం నుంచి పర్యటన చేపడుతున్నారు.  మూడు రోజులపాటు పర్యటన కొనసాగుతుంది. బుధవారం  విజయనగరంలో నారా భువనేశ్వరి పర్యటన వుంటుంది. – టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో  మనస్థాపానికి గురై మృతిచెందిన కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించానున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular