ఏప్రిల్లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Special Festivals at Sri Govindaraja Swamy Temple in April
తిరుపతి
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– ఏప్రిల్ 10, 24వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– ఏప్రిల్ 12వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
– ఏప్రిల్ 13 నుండి 22వ తేదీ వరకు శ్రీ భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నారు.
– ఏప్రిల్ 20న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
– ఏప్రిల్ 21 నుండి 30వ తేదీ వరకు శ్రీ మధురకవి ఆళ్వార్, శ్రీ అనంతాల్వార్ ఉత్సవం నిర్వహించనున్నారు.
– ఏప్రిల్ 23న శ్రీ భాష్యకార్లవారి గంథపుపొడి ఉత్సవం, శ్రీ ముదలియాండాన్ స్వామి వారి (దాశరథి) తిరునక్షత్రం.
– ఏప్రిల్ 28 నుండి 30వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం.



