ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్యే గంగుల కాశీ విశ్వనాథ స్వామికి ప్రత్యేక పూజలు*
వాయిస్ టుడే

Special Pooja to MP Vadiraju MLA Gangula Kashi Vishwanatha Swami
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు తమ కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.మహా కుంభమేళ సందర్భంగా వారు ప్రయాగరాజ్ (అలహాబాద్)వద్ద త్రివేణి సంగమంలో గురువారం పుణ్య స్నానాలాచరించి దేశ ఆథ్యాత్మిక రాజధాని, మోక్షానికి పుట్టినిల్లు, హిందువులకు పరమ పవిత్రమైన పురాతన కాశీ పట్టణానికి (వారణాసి,బనారస్) చేరుకున్నారు.కాశీ విశ్వనాథ స్వామి వారిని శుక్రవారం ఉదయం వద్దిరాజు కిషన్-శశిరేఖ, వద్దిరాజు దేవేందర్-ఇందిర,వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ, వద్దిరాజు వెంకటేశ్వర్లు -ఉమా మహేశ్వరి, గుండాల కృష్ణ (ఆర్జేసీ) -కవిత, గంగుల శారద,గంగుల గీతాదేవి,గంగుల సునీత, గంగుల కమలాకర్ -రజిత,శీలం సత్యనారాయణ-లక్మీ, డాక్టర్ జే.ఏన్.వెంకట్-సునీత,పారా నాగేశ్వర్ రావు -సులోచనారాణి, మహంకాళి భుజంగ రాజశేఖర్ -దేవీ స్వరూపారాణి,చీపిరిశెట్టి శంకర్-అరుణలతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అలాగే, సంగిశెట్టి పద్మ, మరికల్ పోత సుధీర్ కుమార్,బోరిగం విజయ్,వద్దిరాజు శ్రీనివాస్, వద్దిరాజు నాగరాజు,వద్దిరాజు శివ ప్రీతమ్, వద్దిరాజు గిరినందన్, తోట పుష్పలత, మామిడి స్వర్ణలత,గంగుల శ్రేయా, గంగుల జాహ్నవి,గంగుల హరిహరన్ సాయి తదితరులు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.వీరంతా విశ్వనాథుడికి ప్రత్యేక చేసి,వేద పండితుల ఆశీర్వచనాలు,తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం పవిత్ర గంగానదిలో పడవపై కొద్దిసేపు విహరించారు. *కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలి: ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే గంగుల* తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలి అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమ కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి కాశీ విశ్వనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేసి వేడుకున్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షులు,జనహృదయ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ విశ్వనాథ స్వామిని ప్రార్థించారు.