Monday, March 24, 2025

ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ

- Advertisement -

ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ

Specific activity to achieve best results

– 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు

– జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి
రాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన జిల్లా విద్యార్థులు ఉత్తమమైన ఫలితాల సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని   జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష  ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రాబోయే మార్చి నెలలో జరిగే పదవ తరగతి పరీక్షల కోసం ఇప్పటినుండి ప్రణాళిక ప్రకారం విద్యార్థుల స్థాయిని పెంచి వారి సామర్థ్యా ల ప్రకారం మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవా లని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, పిల్లలకు స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులకు ప్రతిరోజు నిర్దేశించిన కార్యచరణ ప్రకారం సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల వారీగా పరీక్షలు నిర్వహించా లని,  ప్రతి పదవ తరగతి విద్యార్థి పాఠశాలకు వచ్చే విధంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉన్నత పాఠశాలలోనే హెడ్ మాస్టర్ ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకొని పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి,  జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్