- Advertisement -
శ్రీ చైతన్య భారతి ఉన్నత పాఠశాల నందు అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీల కార్యక్రమం…….
Sri Chaitanya Bharti High School's Grand Rangoli Competition
చాగలమర్రి
చాగలమర్రి గ్రామంలోని శ్రీ చైతన్య భారతి ఉన్నత పాఠశాల నందు బుధవారం నాడు సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లల తల్లులచే నిర్వహించడo జరిగింది. ముగ్గుల పోటీల కార్యక్రమంలో గెలుపొందిన వారికి మండల విద్యాశాఖ అధికారి-2 న్యామతుల్లా బహుమతులను అందచేయటం జరిగింది.మొదటి బహుమతి గా శ్రీ విద్యకు 2016/-, రెండవ బహుమతి రామిగాళ్ల విజయ రాణికి 1516/-, మూడవ బహుమతి శుభాషిణి కి 1016/-, నాలుగో బహుమతి మేరీ ప్రసన్నకు 516/-, ఐదవ బహుమతి శ్రీలక్ష్మికి 516/- మిగతా వారందరికీ చీరలు, క్యారీ బాక్సులను బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ న్యామతుల్లా పాఠశాలలో ఇంత చక్కగా ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించిన పాఠశాల సిబ్బందికి అభినందనలు తెలిపారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ చరిత్ర లేనిదే మనము లేమని సంస్కృతి సాంప్రదాయాలు అనేవి తరతరాలుగా అలాగే కొనసాగాలని, అందరూ ఐకమత్యంగా వీటిని నిర్వహించాలని, ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి. మల్లికార్జునరావు , ఏవో పి.చంద్రకళ , డైరెక్టర్ పి.శారద , అకాడమీ డైరెక్టర్ చంద్రమౌళి , ప్రధానోపాధ్యాయులు డి.మహమ్మద్ రఫీ , పాఠశాల ఉపాధ్యాయిని , ఉపాధ్యాయులు , తదితరులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -