బిఎస్ రావుకు ప్రథమవర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన శ్రీ చైతన్య ఉపాధ్యాయులు
తాడేపల్లిగూడెం
Sri Chaitanya’s teachers paid tribute
శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బొప్పన సత్యనారాయణ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం చిన్న తాడేపల్లి లోని శ్రీ చైతన్య పాఠశాల నందు బిఎస్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పాఠశాల ఉపాధ్యాయులు. విద్యా వ్యవస్థలో ఒక విలక్షణ శైలితో విద్యాలయాలు నెలకొల్పి లక్షలాది విద్యార్థులకు విద్యను అందించిన మహోన్నత వ్యక్తి బిఎస్ రావు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రసాద్ కొనియాడారు. చెన్నై హైదరాబాదు వంటి నగరాలకే పరిమితమైన విద్య విధానాన్ని విజయవాడకు తీసుకువచ్చిన ఘనత బిఎస్ రావు కే దక్కుతుందని, ఈనాడు ఐఐటీలను తీర్చే సంస్థగా శ్రీ చైతన్య ముందు వరుసలో నిలిచిందని ఏజిఎం సుంకర పార్థసారథి తెలియజేశారు. పాఠశాల డీన్ నాగార్జున, సి బ్యాచ్ ఇంచార్జ్ సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, తధనుగుణంగా తెలుగు రాష్ట్రాలలో తయారవుతున్న ఐఐటీయన్లు, డాక్టర్లు గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ రామారావు ప్రైమరీ ఇంచార్జ్ శ్రీలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ స్వరూప మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు బిఎస్ రావు చిత్రపటానికి పుష్ప గుచ్చాలనుంచి ఘనంగా నివాళులర్పించారు



