అబాకస్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు
అబాకస్, వేదిక్ మాథ్స్ లో సూర్యాపేట జిల్లా,నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు గోల్డ్ ,సిల్వర్ మెడల్స్ సాధించినట్లు, పాఠశాల ప్రిన్సిపల్ బుస్సా సులోచన తెలిపారు. పాఠశాలకు చెందిన జి . రిషిత, ముకేష్, దీక్షిత , వృషిత్ గోల్డ్ మోడల్స్ ,మోక్షిత్ సాయి, పనేత్ర, శ్రీజ ,ఇందు, లు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు తెలిపారు. మరి కొంతమంది విద్యార్థులు ఎక్సలెన్స్ సర్టిఫికెట్స్ పొందారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు సోమవారం పాఠశాలలో మెడల్స్ పంపిణీ చేసి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్దులకు గణితం పై అవగాహన, సులభం గా నేర్చుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు వీరయ్య, హర్ష ,మల్లిక పాల్గొన్నారు.
అబాకస్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు
- Advertisement -
- Advertisement -



