Wednesday, December 18, 2024

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’ అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది.

- Advertisement -

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’ అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది.

Srikakulam is Sherlock Holmes unpredictable.

ఆడియన్స్ ఖచ్చితంగా చాలా థ్రిల్ అవుతారు: డైరెక్టర్ రైటర్ మోహన్

వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రాన్ని  లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రైటర్ మోహన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ ఎలా స్టార్ట్ అయ్యింది? వెన్నెల కిషోర్ గారిని టైటిల్ రోల్ కి తీసుకోవడానికి కారణం?
-ఇది ఏడుగురికి సంబధించిన కథ. వెన్నెల కిషోర్ గారిది డిటెక్టివ్ రోల్. రైల్ కి ఇంజన్ లాంటి క్యారెక్టర్. మిగతా బోగీలు కూడా ముఖ్యమే. ప్రతి పాత్ర కథలో చాలా కీలకంగా వుంటుంది. ఇందులో డిటెక్టివ్ రోల్ కొంచెం హ్యుమర్ తో వుంటుంది. ఆ పాత్రకు వెన్నెల కిషోర్ గారు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. ఆయన ఉత్తరాంధ్ర యాసని ఒక ఛాలెంజ్ తీసుకొని కష్టపడి నేర్చుకొని సినిమా చేశారు. సినిమాలో శ్రీకాకుళం యాస పట్ల చాలా కేర్ తీసుకున్నాం. కథలో క్రైమ్ కామెడీ ఎమోషన్ థ్రిల్ లవ్ అన్నీ బ్యాలెన్స్ గా వుంటాయి.
శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ ని తీసుకోవడానికి కారణం ?
-ఇది 1991లో జరిగే కథ. టీజర్ లో చెప్పినట్లు రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఇంకొన్ని సంఘటనలు జరిగాయి. వీటి మధ్య వున్న సంబంధం ఏమిటనేది షెర్లాక్ హోమ్స్‌ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ తో చాలా ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో చేయడం జరిగింది. ఈ కథని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరు. చాలా సస్పెన్స్, థ్రిల్ వుంటుంది.
చంటబ్బాయ్ తాలూక అని ట్యాగ్ పెటడానికి కారణం?
-తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. షెర్లాక్ హోమ్స్‌ అనేది హాలీవుడ్ ఫిక్షనల్ క్యారెక్టర్. అది కొందరికి పరిచయం లేకపోవచ్చు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా వంశీ నందిపాటి గారి సూచన మేరకు ఆ ట్యాగ్ ని పెట్టడం జరిగింది. అందులోనూ ‘తాలూకా’ అనేది ఇప్పుడు ట్రెండింగ్.
-వంశీ నందిపాటి గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా థ్రిల్ అయ్యారు. ఆయన సినిమా రిలీజ్ చేయడం చాలా అనందంగా వుంది. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలతో సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. ఆర్ఆర్, సిజీని చాలా ఇంపాక్ట్ ఫుల్ గా చేయించారు. మా నిర్మాత రమణారెడ్డి గారికి, వంశీ గారికి మంచి సింక్ కుదిరింది.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
-ఈ సినిమాలో డిటెక్టివ్ కి అమ్మనాన్నలలే సహాయకులిగా వుంటారు. అమ్మ పేరు షర్మిల, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్‌ అని పెట్టడం జరిగింది.
రైటర్ మోహన్ పేరు ఎలా వచ్చింది ?
-నా కెరీర్ ఇవివి గారి దగ్గర మొదలైయింది. తర్వాత పోసాని గారి దగ్గర చేశాను. తర్వాత రాజశేఖర్ గారి సినిమాలకి చేశాను. ఆయనే రైటర్ మోహన్ అనే పేరు వేశారు. సినిమా టీంలో ఒకే పేరుతో చాలామంది వుంటే వాళ్ళ డిపార్ట్మెంట్ పేరుతో పిలుస్తారు. నేను రైటింగ్ డిపార్ట్మెంట్ లో చాలా కాలం పని చేయడంతో రైటర్ మోహన్ అనే పేరులా అలా నేచురల్ గా వచ్చింది.
మ్యూజిక్ గురించి ?
-సునీల్ కశ్యప్ పాటల ఇచ్చారు. ఇప్పటికే సాంగ్స్ వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ జ్ఞాని చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది.
రైటర్ గా మీ బలం ?
-నేను కామెడీ బాగా చేయగలను. అది మా గురువు గారు ఈవివి గారి దగ్గర నేర్చుకున్నాను. రైటర్ గా పూర్తిగా అనుభవం సాధించిన తర్వాతే దర్శకుడు కావాలని అనుకున్నాను.
నెక్స్ట్ ఏ జోనర్ లో చేయబోతున్నారు ?
-నెక్స్ట్ ఎమోషనల్ జోనర్ లో ఓ సినిమా చేయబోతున్నాను. స్క్రిప్ట్ సిద్ధంగా వుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్