సిద్దిపేటకు చెందిన ఉద్యోగి
షమీర్పేట లోని ఈటల రాజేందర్ నివాసంలో బీజేపీలో చేరిన శ్రీశైలం ముదిరాజ్.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 2013 సెప్టెంబర్ 7 వ తారీఖు నాడు ఏపీఎన్జీఓ నాయకులు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కడుపు మండిన ఇద్దరు కానిస్టబుళ్ళు శ్రీశైలం ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగం పోతుంది అని తెలిసి కూడా జై తెలంగాణ నినాదాలు చేశారు.
అప్పుడు నేను వారిని అభినందించి సత్కారం కూడా చేశాము.
కానీ వచ్చిన తెలంగాణలో అనుకున్న ఫలితాలు అనుకున్న వర్గాలకు అందలేదు. ఆత్మగౌరవం దక్కలేదు. ప్రజల పక్షాన నిలబడాలని దానికి సరైన వేదిక బీజేపీ అని భావించి మా సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. సిద్దిపేటలో బహిరంగ సభ పెట్టి పెద్దఎత్తున జాయినింగ్స్ కార్యక్రమం ఏర్పాటుచేస్తాము. సిద్దిపేటలాంటి గడ్డమీద ఇలా ఉంటే తెలంగాణ గడ్డమీద ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. సిద్దిపేట గడ్డమీద తెలంగాణ ప్రజల ఆత్మగౌరవబావుట ఎగిరే సందర్భం ఆసన్నమైంది. ప్రజలు ఆలోంచించాలని విజ్ఞప్తి చేస్తున్న. మా సంపూర్ణమద్దతు ఉంటుంది అని హామీ ఇస్తున్న.
– ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికలనిర్వహణ కమిటీ చైర్మన్.
శ్రీశైలం ముదిరాజ్ మాట్లాడుతూ: సిద్దిపేటలో అరాచకం నడుస్తుంది. అక్కడివారిని ఎదుర్కొనే సత్తా ఈటలకే ఉంది అని ఆయన అధ్వర్యంలో బీజేపీలో చేరాను. ఉద్యమసమయంలో మేము చేసిన పనికి చాలా హామీలు ఇచ్చారు. కానీ బలహీనవర్గాల బిడ్డలు కాబట్టి ఒక్కటీ నెరవేర్చలేదు. సిద్దిపేటలో హరీష్ ఏది చెప్తే అదే.. అయ్యా బాంచన్ అంటేనే పనులు చేస్తున్నారు. ఏంది అని ప్రశ్నిస్తే వేధిస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ ల దొరల ప్రభుత్వాన్ని ఇంటికిపంపే సత్తా ఈటల రాజేందర్ కే ఉంది. తెలంగాణ రాజకీయాలను పూర్తిగా చెడగిట్టింది, నాశనం చేసింది రేవంత్ రెడ్డి. అప్పట్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. ఇప్పుడు డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగకు తాళం చెవులు అప్పగించారు.
కేసీఆర్ భూములు అమ్మితే.. రేవంత్ ఏకంగా మనుషులను, వారి అవయవాలను అమ్ముతారు.
నేడు ఈటెల రాజేందర్ అన్న ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నిప్పురవ్వ కానిస్టేబుల్ జై తెలంగాణ శ్రీశైలం ముదిరాజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకై పార్టీ సేవకై మీలో ఒకడిగా మీకు సేవకుడిగా బిజెపి పార్టీలో తన కార్యకర్తలు చల్ల రవీందర్ రెడ్డి ముంజ లింగమూర్తి గౌడ్ మంద కిషన్ మాదిగ బండారి లింగం మాదిగ కర్రె స్వామి మాదిగ లతో కలిసి చేరడం జరిగింది ఇట్లు మీ జై తెలంగాణ శ్రీశైలం ముదిరాజ్