ఆలయాన్ని మళ్ళీ శుద్ధి చేయాల్సివస్తుందని శ్రీవారే రానివ్వలేదు

- Advertisement -

జగన్ అడుగుపెడితే ఆలయాన్ని మళ్ళీ శుద్ధి చేయాల్సివస్తుందని శ్రీవారే రానివ్వలేదు

Srivare did not allow the temple to be cleaned again

జనసేన పార్టీ కిరణ్ రాయల్

వైకాపా పాలనలో..  తిరుమలను పూర్తిగా అపవిత్రంతో పాటు అవినీతిమయం చేశారని..  శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసి పవిత్రమైన వాతావరణంలో భక్తులు దర్శనాలు చేసుకుంటుంటే..  మాజీ సీఎం జగన్ నిన్న శుక్రవారం తిరుమల దర్శనం చేసుకుంటానని రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టిస్తే .. శ్రీవారి భక్తులు  క్రిస్టియన్ మతస్థుడైన జగన్ ఏడుకొండలకు రాకూడదని నిరసన వ్యక్తం చేస్తుంటే..  దీనిని గ్రహించిన ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ జగన్ మోహన్ రెడ్డిని తిరుమల కొండకు రానివ్వకుండా చేశారని .. జనసేన పార్టీ నేతలు కిరణ్ రాయల్ , ఆకేపాటి సుభాషిని తదితరులు తెలియజేశారు.  తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తానని ప్రకటించిన..  వెంటనే దాదాపు 30 వేల మంది వైసీపీ కార్యకర్తలు మార్గం పొడవున పక్క ప్లాన్ తో కోడి కత్తి , గులక రాయి లాంటి మరో సరికొత్త ప్లాన్ చేసినట్లుoదని  ఆరోపించారు.   ఇది కాకుండా పాలక పక్ష కూటమి నేతలు జగన్ పై కోడిగుడ్లతో దాడి చేయడానికి ఉన్నారని .. వైసీపీ వాళ్లు తప్పుడు ప్రచారం చేయడంలో నిజాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం అయినా తనకే తిరుమల దర్శన విషయంలో కూటమి వారు కుట్ర చేశారని ఇక సామాన్య దళితులు దర్శనం ఎలా చేసుకోగలరని అసత్యపు మాటలు జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.   ఇదంతా రాజకీయ ప్రచారమే అని నిజానికి శుక్రవారం కోర్టు కేసును తప్పించుకోవడానికి , పబ్జి గేమ్స్ ఆడుకోవడానికి , తిరుమలకు వెళ్లి డిక్లరేషన్తో శ్రీవారిని దర్శించుకుంటే భార్య భారతి ఇంట్లో అడుగుపెట్టెనివ్వదని..  పలు రకాల కారణాలతో జగన్ కొండకు డుమ్మా కొట్టాడని హాస్య చతురలు విసిరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular