Sunday, September 8, 2024

ఎస్‌ఎస్‌సి పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’ పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్ నవంబర్ 27న విడుదల

- Advertisement -

సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుధీర్‌ బాబుకు ఇది అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్.  తాజాగా ఈ చిత్రం టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘హరోం హర’ పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్ నవంబర్ 27న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నిప్పుల కొలిమిలో ఓ ప్రత్యేకమైన ఆయుధాన్ని కాల్చుతూ మజిల్డ్ బాడీతో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సుధీర్ బాబు. ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది.  ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అక్షర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు పలకనున్నారు.ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.  ‘హరోం హర’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, అక్షర

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్