Sunday, April 13, 2025

స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ‘అరి’ సినిమా నుంచి ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ రిలీజ్

- Advertisement -

స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ‘అరి’ సినిమా నుంచి ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

Star director Nag Ashwin releases lyrical song 'Bhaga Bhaga..' from the movie 'Ari'

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ రోజు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘అరి’ సినిమా నుంచి ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ చాలా బాగుందన్న నాగ్ అశ్విన్…మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ ఫైర్ ఉన్న బీట్ తో కంపోజ్ చేయగా..వనమాలి పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు. షణ్ముక ప్రియ, రోహిత్ పీవీఎన్ఎస్ ఇంటెన్స్ గా పాడారు. ‘భగ భగ..’ సాంగ్ ఎలా ఉందో చూస్తే – ‘మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు, భగ భగ భగ భగ మండే నీలో ఏదో సెగ, అంతులేని ఏంటి దగా, మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు..’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.
నటీనటులు – వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్