మహరాష్ట్ర మంత్రి
నల్గోండ: ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజల కనీస ఆకాంక్షలు కూడా నెరవేరలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శోభకరం ధ్లాజే అన్నారు.. రాష్ట్రంలో రైతంగం పరిస్థితి దయానియంగా మారిందని చెప్పారు. నల్గొండ జిల్లా నాగర్జున సాగర్ జరిగిన బిజెపి అసెంబ్లీ నియోజకవర్గస్థాయి ముఖ్యుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.. పలు అభివృద్ధి పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లక్షల కోట్ల నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. వాటికే పేర్లు మార్చి బిఆర్ఎస్ ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకుంటుందన్నారు.

పదేళ్ల కెసిఆర్ బంగారు తెలంగాణ పాలనలో అయినా కుటుంబమే బంగారం గా మారింది కానీ ప్రజలకు ఏమేలు జరగలేదని విమర్శించారు. సీఎం ఫామ్ హౌస్ లో పడుకుంటే ఆయన కుటుంబం అవినీతిలో మునిగి తేలుతుందని అన్నారు. ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి పసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా మార్పు కోరుకోవాలని బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని గుర్తించాలన్నారు.