స్టీఫెన్ హాకింగ్ నేటి, భవిష్యత్ తరాల శాస్త్రవేత్తలకు స్ఫూర్తి
Stephen Hawking is an inspiration to today's and future generations of scientists
– ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి .ప్రసాద్
ఎమ్మిగనూరు : జనవరి 9
స్టీఫెన్ హాకింగ్ నేటి, భవిష్యత్ తరాల శాస్త్రవేత్తలకు స్ఫూర్తి అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి .ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్టీఫెన్ హాకింగ్ జయంతిని ఎమ్మిగనూరు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ముందుగా స్టీఫెన్ హాకింగ్ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ పి. ప్రసాద్ పూలమాలవేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల
ప్రిన్సిపల్ శ్రీయుతులు ప్రసాద్ మాట్లాడుతూ స్టీఫెన్ హాకింగ్ జీవితము నేటి, భవిష్యత్ తరాలకు ఆదర్శమని ఆయన అరుదైన నరాల సంబంధమైన వ్యాధితో బాధపడుతూ, చివరకు శరీరం ఆ చేతనమైన, పని చేయలేని
పరిస్థితిలో ఉన్న పనిచేసే ఒకే చురుకైన మెదుడుతో చక్రాల కుర్చీకే తన జీవితం అత్యధిక భాగం గడిపిన విశ్వంలోని అతి సంక్లిష్టమైన బ్లాక్ హోల్స్ పరిశోధన చేసి బ్లాక్ హోల్స్ రేడియేషన్ వెలువరించి చివరకు బ్లాక్
హోల్స్ కూడా చివరకు అంతర్ధానం అవుతాయని ,ప్రస్తుత పుడిమిపై నివసిస్తున్న మానవుడు భవిష్యత్ తరాల కోసం ఇతర గ్రహాలపై నివసించాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి అందుకు అనుగుణంగా మానవుడు శాస్త్ర
విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శంకరయ్య మాట్లాడుతూ మన సమాజంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు మూలుగుతున్నాయని వాటిని నేటి
విద్యార్థులైన రేపటి పౌరులు శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకొని, భవిష్యత్ తరాలు శాస్త్రీయ పౌరులుగా రూపొందేటట్లు కృషి చేయాలని ,నేటి విద్యార్థులు జ్ఞానాత్మకంగా, నైపుణ్యాత్మకంగా ,విభిన్న కోణాలలో ఆలోచించే
క్రియేటివ్ పౌరులుగా ఎదగాలని స్టీఫెన్ హాకింగ్ తన జీవితములో అత్యధిక భాగం చక్రాల కుర్చికే పరిమితమైన బ్లాక్ హోల్స్ పై పరిశోధన చేశాడంటే ఆయన యొక్క ఆత్మవిశ్వాసము, అంచలంచలమైన దృఢనిశ్చయం
కారణాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు బి.జి మాదన్న మాట్లాడుతూ మానవ సమస్యలు అన్నిటినీ విద్య అందులో ముఖ్యంగా శాస్ర్తియ విద్య పరిష్కరిస్తుందని కాబట్టి నేటి
విద్యార్థులుమంచి విద్యను అభ్యసించి దేశాభివృద్ధి లో పాటుపడాలని” పిలుపునిచ్చారు.ఉపాన్యాసాకులు రాజశేఖర్ రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాన్యాసాకులు
రమేష్,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.