సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలి..
జిల్లా వ్యవసాయ, మండల ప్రత్యేకఅధికారి దోమ ఆదిరెడ్డి
కమాన్ పూర్,
Steps should be taken to prevent seasonal diseases.
కమాన్ పూర్ మండలంలోని అన్నీ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని మండల, గ్రామ స్థాయి అధికారులకు సూచించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి తెలిపారు. కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో శనివారం జూలపల్లి గ్రామంలో పారిశుధ్య నిర్వాహణ పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామ స్థాయి అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు పారిశుధ్య నిర్వాహణ తీరు పట్ల అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైపాడ్ వంటి వ్యాద్దుల బారిన పడకుండా ఉండాలంటే ఇంటి యజమానులు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో మురికి కాలువల్లో పూడికతీత చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని, తాగునీటి ట్యాంకుల్లో క్లోరోనేషన్ చేయాలని, పిచ్చి మొక్కలు తొలిగించాలని గ్రామ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో గల వివిధ పాత్రల్లో వర్షపు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది వ్యాదుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఇంటి యజమానులు చూసుకోవాలని సూచించారు. పారిశుధ్య నిర్వాహణ పై ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపిడివో శేషయ్య సూరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, కారోబార్ బర్ల భూమయ్య, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.