Sunday, September 8, 2024

బెల్టు షాపుల మూసివేత దిశగా అడుగులు

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 13, (వాయిస్ టుడే): గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బెల్ట్ షాపుల మూసివేతకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని టాక్. బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం విషయం తెలిసిందే. హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2 వేల 620 వైన్ షాపులు ఉన్నాయి. వైన్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం12 వేల 769 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 6 నుంచి 10కి పైగా బెల్ట్ షాపులు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన చూసినట్లైతే.. రాష్ట్రంలో లక్ష 10 వేలకు పైగా మందు షాపులు ఉన్నాయి. అయితే బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుంటే వారిపై కేసులు పెట్టేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుందట. లిక్కర్అమ్మకంద్వారా ప్రభుత్వానికి సంవత్సరం రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుంది. రీసెంట్‌గా ఎన్నికల కోడ్వల్ల బెల్టుషాపులు బంద్చేశారు. కొత్త లైసెన్స్‌ల వ్యాపారం డిసెంబర్1 నుంచి స్టార్ట్ అయ్యింది. ఎన్నికల అనంతరం మళ్లీ కొత్తగా బెల్టుషాపులతో అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. హోల్సేల్, రిటైల్పేరుతో రెండు రకాల లిక్కర్దందా నడుస్తుంది. కాగా గ్రామాల్లో బెల్టుషాపులు తీసేస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.16 వేల కోట్ల ఆదాయం తగ్గవచ్చని ఎక్సైజ్శాఖ అంచానా వేస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్