Sunday, September 8, 2024

వ్యూహం ట్రైలర్ ఘనంగా లాంఛ్…

- Advertisement -

ఎన్నో రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని ప్రజా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ఎదిగిన వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ వ్యూహం సినిమాను రూపొందిస్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్‌ నటిస్తుండగా…వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తున్నారు.  వ్యూహం సినిమాను నవంబర్ 10న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ ను ఇవాళ ఘనంగా లాంఛ్ చేశారు.

Strategy trailer grandly launched...
Strategy trailer grandly launched…

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – నేను డైరెక్ట్ చేసే సినిమాలన్నింటిలో 80శాతం ఏదో ఒక ఇన్సిడెంట్ ఇన్సిపిరేషన్ తోనే రూపొందిస్తాను. పదేళ్ల క్రితం దివగంత సీఎం వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు జరిగిన సంఘటనలు నాకు ఈ సినిమా చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి. సడెన్ గా ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు కొందరు ఆ సందర్భాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు, మరికొందరికి అది డిస్ అడ్వాంటేజ్ అవుతుంది..ఇంకొందరిలో కొత్త కొత్త అజెండాలు పుట్టుకొస్తాయి. ఇలాంటి అంశాలన్నీ దర్శకుడిగా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఈ కథలో వైఎస్ మృతి నుంచి నేటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు ఉంటాయి. అయితే అది ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్ సైడ్ జరిగిన విషయాలన్నీ ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఒక పెద్ద నిర్ణయం జరిగినప్పుడు దాని వెనక ఎన్నో ఆలోచనలు జరుగుతాయి. అవి బయటకు తెలియవు. ఈ మొత్తం ఇన్సిడెంట్స్ లో ఉన్న వారి దగ్గర నుంచి సమాచారం సేకరించాను. ఆ సమాచారం ఆధారంగా ప్రేక్షకులకు నచ్చే ఒక సినిమాటిక్ ఫార్మేట్ లో వ్యూహం సినిమాను రూపొందించాను. అన్నారు.

నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – మేము వంగవీటి అనే సినిమాను రూపొందించినప్పటి నుంచి ఏదైనా గ్రేట్ మూవీ చేయాలని అనుకుంటున్నాం. మేము చేసిన రీసెర్చ్ లో భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చి 9 ఏళ్లు ఎంతో కష్టపడిన వ్యక్తిని చూడలేదు. ఏ ముఖ్యమంత్రి కొడుకు అన్ని కష్టాలు పడలేదు. వైఎస్ఆర్ లాంటి గొప్ప వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్ ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నారు. మాకు ఆయన లైఫ్ కంటే ఇంట్రెస్టింగ్ కథ మరేదీ అనిపించలేదు. వ్యూహం సినిమాలో ప్రజలకు తెలియని ఎన్నో గొప్ప ఇన్సిడెంట్స్, విషయాలు ఉంటాయి. అవన్నీ ప్రజలకు ఒక సినిమా రూపంలో ఆకట్టుకునేలా చూపిస్తే బాగుంటుంది అనుకుని వ్యూహం మొదలుపెట్టాం. సమయానుకూలంగా చేస్తేనే ఏ పని అయినా బాగుంటుంది. ఇది వ్యూహంకు రైట్ టైమ్ అనుకుంటున్నాం. ఇది జగన్ గారి బయోపిక్ కాదు. బయోపిక్ అయితే ఆయన పుట్టినప్పటి నుంచి జరిగిన విషయాలు చూపించాలి. కానీ ఆయన రాజకీయ జీవితంలో కొంత పీరియడ్ ఆఫ్ టైమ్ తీసుకుని ఆ టైమ్ లో జరిగిన సంఘటనలు చూపిస్తున్నాం. అన్నారు.

వ్యూహంతో పాటు శపథం అనే మరో సినిమాను కూడా రూపొందిస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్.  జనవరి 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

నటీనటులు – అజ్మల్, మానస తదితరులు  టెక్నికల్ టీమ్ – డీవోపీ – సుజీష్‌ రాజేంద్రన్, ఎడిటర్‌– మనీష్‌ ఠాకూర్,  పిఆర్వో– శివమల్లాల, నిర్మాత – దాసరి కిరణ్ కుమార్, దర్శకత్వం – రామ్ గోపాల్ వర్మ.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్