Thursday, January 15, 2026

బలం…బలగం… రంగనాధే…

- Advertisement -

బలం…బలగం… రంగనాధే…
హైదరాబాద్, మే 12, (వాయిస్ టుడే )

Strength...strength... Ranganath...

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీకి బలం, బలగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చి పెట్టారు. హైడ్రాకు ఇప్పటికే చట్టబద్ధత కల్పించిన రేవంత్ రెడ్డి దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయడమే కాకుండా సిబ్బందితో పాటు అన్ని రకాల వాహనాలను సమకూర్చారు. దీన్ని బట్టి హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. హైడ్రా కూల్చివేస్తుందని గగ్గోలు పెడుతున్న వారంతా ఆక్రమించుకున్న వారే. నాలాలు, చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో హైదరాబాద్ నగరానికి మంచి భవిష్యత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు శ్రీకారం చుట్టారు.ఇందులో ధనికులు, పేదలు అన్నది తేడా లేకుండా హైడ్రాకూల్చివేతలను ప్రారంభించింది. ప్రారంభంలో హైడ్రా మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. విపక్షాలు మాత్రమే కాదు. స్వపక్షం నుంచి కూడా హైడ్రా ఏర్పాటు తో పాలకవర్గం ఘాటైన విమర్శలు ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే హైడ్రాను వ్యతిరేకించారు. ఇక ఎటూ ప్రతిపక్షాలు కూడా సహజంగా హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చివేయడానికే ఏర్పాటు చేసిందంటూ విమర్శలకు దిగింది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా దానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల హైడ్రా పోలీస్ స్టేషన్ ను స్వయంగా ప్రారంభించి తనపై వచ్చే విమర్శలకు ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. హైడ్రాకు తాను అండగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ గట్టిగా సిగ్నల్స్ పంపగలిగారు.హైదరాబాద్ మరో బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాలతో పోటీ పడకుండా ఉండాలంటే.. మనం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. నిజమే బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాలు చిన్నపాటి వర్షం కురిస్తే చాలు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇకవేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. అలాగే హైదరాబాద్ లో 960 చెరువులు ఉండగా, ఇందులో 461 చెరువుల్లో ఆక్రమణలు చోటు చేసుకోవడంతో ముందు వాటిని తొలగించే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. మరొక వైపు ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి సర్కార్ పరం చేయగలిగింది. దీనివల్ల ప్రభుత్వానికి లాభం చేకూర్చడమే కాకుండా హైదరాబాద్ నగర భవిష్యత్ కు కూడా హైడ్రా ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక హైడ్రా జూలు విదిలిస్తుందని, వరసగా ఆక్రమణలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్