Sunday, September 8, 2024

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

- Advertisement -
Strict action against those involved in unsocial activities
Strict action against those involved in unsocial activities

*రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించండి*

*దుప్పట్లు, హెల్మెట్, నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు

వాయిస్ టుడే :ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా :
జిల్లాలో ఆసంఘీక కార్యకలాపాలు పల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు,శుక్రవారం జిల్లాలోని కాగజ్నగర్ సబ్ డివిజన్లో గల కౌటాల సర్కిల్లోని మారుమూల గ్రామం అయినా తూమ్మిడిహట్టి గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో కాగజ్ నగర్ లోని షణ్ముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా 200 బ్లాంకెట్స్ , 5 వాలీబాల్ కిట్స్, 30 హెల్మెట్, మరియు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ డివీ శ్రీనివాసరావు మాట్లాడుతూ
సంఘ విద్రోహక శక్తులకు సహకరించ వద్దనీ. యువత వారి అసత్యపు మాటలకు, ప్రలోభాలకు లొంగిపోయి మోసపోవద్దనీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అన్నారు. మీ ప్రాంతంలో కొత్త వ్యక్తులు వచ్చిన సంచరించిన పోలీస్ వారికీ సమాచారం అందించాలని అన్నారు. గతం లో జరిగిన సంఘటనలు, పరిస్థితి లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుటాం అన్నారు,ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి,వాటికి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకువదని అన్నారు,త్వరలోనే జాబ్ మేళలు ఏర్పాటు చేసి అరుహులైన వారికి ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు,
ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డిఎస్పి కరుణాకర్, కౌటల సర్కిల్ ఇన్స్పెక్టర్ సాదిక్ పాషా , ఎస్ఐ మధుకర్, నరేష్ షణ్ముఖ హాస్పిటల్ డాక్టర్ల బృందం మరియు సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్