నిషేధిత చైనా మాంజాను అమ్మితే కఠిన చర్యలు

- Advertisement -

నిషేధిత చైనా మాంజాను అమ్మితే కఠిన చర్యలు

Strict action for sale of banned Chinese manja

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల,
జగిత్యాల
జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు.
జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.
చైనా మాంజా తో తలెత్తే అనర్థాల పై అందరికి అవగాహన కలిగి  ఉండాలన్నారు.నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని,  జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు .
చైనా మాంజాను అమ్మినా,రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గాని డయల్ 100 గాని ఫోన్ చేసి తెలపాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular