మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలి
Strict action should be taken against Mohan Babu
ఉమ్మడి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ డిమాండ్.
మేడిపల్లి,
జల్పల్లి ఫామ్ హౌస్ లో టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై జరిగిన దాడి ఘటనలో సినీనటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఉమ్మడి మేడిపల్లి మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నోముల నరసింహారెడ్డి,చింతకింది లక్ష్మీపతి మాట్లాడుతూ సమాజంలో నాలుగో పిల్లర్ గా ఉన్న మీడియా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గత కొంతకాలంగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాలను పరిష్కరించుకోవాలి కానీ వార్త వెళ్లిన వారిపై దాడులకు పాల్పడడం సరికాదని అన్నారు మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించిన,దాడులకు పాల్పడిన వారి పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చి అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్గం మహేశ్, నీలగిరి ప్రవీణ్ రావు,మామిడి ఆంజనేయులు,బక్కురి నరేశ్, వెల్మలపల్లి చిరంజీవి,కుందారపు ప్రభాకర్,ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు