తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత పై పర్యవేక్షించిన
రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్
తిరుపతి: ఈ నెల 18 వ తేదీ నుండి తిరుమల లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలవుతున్న సందర్భంగా తిరుమల చేరుకున్న రాష్ట్ర డిజిపి రవీంద్రనాథ్ రెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు పోలీసులు తీసుకున్న భద్రతా చర్యలపై సమీక్షించారు….
ఈ సందర్భంగా డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.
తిరుమల బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేశామని 6 మంది ఎస్పిలతో సహ 4,900 మంది పోలీసు సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశామని తిరుమలలో భక్తుల రద్ది పెరిగితే తిరుపతిలోనే ట్రాఫిక్ నియంత్రణ చేస్తామని, తిరుపతిలో మూడు ప్రాంతాలలో భక్తుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూన్నామని
నాలుగు మాడ వీధులలో ప్రత్యేకంగా భధ్రతా ఏర్పాట్లు చేసామని, దోంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీం లను ఏర్పాటు చేశామని ఇద్దరు డిఐజిలు నిరంతరాయంగా భధ్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారనీ
భధ్రతా ఏర్పాట్లు కోసం డ్రోన్ కెమరాలు వినియోగిస్తున్నట్టు రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి వెంట డిఐజిలు రాజశేఖర్ బాబు, రవిప్రకాష్, ఎస్పిలు పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, సివియస్ఓ నరశింహ కిషోర్ వున్నారు…
తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
తిరుమలలో 15 వేల వాహనాలుకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, చిన్నపిల్లలు తప్పిపోకూండా జియో ట్యాగింగ్ చేస్తామని ముఖ్యంగా నాలుగు అంశాలు పై ప్రత్యేక దృష్టి సారించామని క్రౌడ్ మేనేజ్మేంట్, ట్రాఫిక్ మేనేజ్మేంట్, విఐపిల భధ్రత, భక్తుల భధ్రత కల్పిస్తామని భక్తులు పట్ల మర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారిని గైడ్ చేసేవిధంగా సిబ్బందికి సూచన చేశామని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలియచేశారు…