- Advertisement -
పదవ తరగతి పరీక్షలకు విద్యార్దులను సన్నద్దం చేయాలి
Students should be prepared for class 10 exams
సిద్దిపేట
జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక బద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు
మంగళవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మార్చి 21 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు సిద్ధం చేయడం కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల వారిగా పదవ తరగతి పరీక్షలలో పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధించడం కోసం ఆయా పాఠశాలలు అనుసరిస్తున్న విధానం గురించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల మాదిరిగానే జిల్లా పదవ తరగతి పరీక్షలో ఈ సంవత్సరం కూడా పై భాగంలో నిలిచేలా ప్రణాళిక బద్ధంగా పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేకంగా చదివించాలని అన్నారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్క విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యార్థుల వెనుకబడి ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించి 100% ఉత్తీర్ణత తీసుకురావాలని అన్నారు. జనవరి మొదటి వారం వరకే సిలబస్ పూర్తి అయినందున ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక సమయం కేటాయించి చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు దత్తత తీసుకొని చదివించాలని అన్నారు. అదనపు సమయాల్లో చదివిస్తున్నందున విద్యార్థులకు స్నాక్స్ కొరకు 25 లక్షల రూపాయలు అందిస్తానని వాటిని ఉపయోగించి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని అన్నారు. అన్ని సబ్జెక్టులలో ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించాలని విద్యార్థుల వారీగా టెస్టుల వారీగా అసైన్మెంట్ షీట్ అన్ని పాఠశాలలో ఉండాలని అన్నారు. అలాగే పిల్లల అభ్యసన స్థాయి విషయాన్ని పేరెంట్స్ కు తెలియజేసి పిల్లలు బాగా చదివేల వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలని అన్నారు. అనాధలు మరియు నిరుపేద విద్యార్థుల పై వారి వ్యక్తిగత సమస్యలు ప్రభావం చూపకుండా వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అవసరమైతే ఇతర శాఖల సహకారం కూడా అందిస్తామని తెలిపారు. ఈ నెలన్నర రోజులు విద్యార్థులు ఆబ్సెంట్ కాకుండా చూడాలన్నారు. విద్యార్థులు స్వేచ్ఛ చదివే అవకాశం ఇవ్వాలని, వారికి పెట్టే ఆహారం కూడా పూర్తిస్థాయిలో తినేలా చూడాలని అన్నారు. విద్యార్థి జీవితంలో కీలకమైన ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే భవిష్యత్తులో ఎప్పటికీ మిమ్మల్ని విద్యార్థులు గుర్తుంచుకుంటారని ఉపాధ్యాయుల కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలు , కేజీబీవీ లలో 10815 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని వారందరూ పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ద్వారా పరీక్షకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో 3309 మంది విద్యార్థులు 10 వ తరగతి చదువుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్ష సెక్రటరీ షౌకత్ అలీ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మయ్య, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -