Sunday, February 15, 2026

విద్యార్థులకు మంచి విద్య, ఆహారం అందించాలి

- Advertisement -

విద్యార్థులకు మంచి విద్య, ఆహారం అందించాలి
జయశంకర్ భూపాలపల్లి,

Students should be provided with good education and food

విద్యార్థులకు మెరుగైన విద్య,  నాణ్యమైన ఆహారం అందించాలి, సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురుకుల పాఠశాలలలో మౌలిక వసతులు కల్పనపై కెజిబివి, ఎస్సి, బిసి, గిరిజన సంక్షేమ,   గురుకుల పాఠశాలలు, వసతి గృహ సంక్షేమ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన విద్య నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయపు  సమావేశ మందిరంలో కేజిబివి, ఎస్సి, బిసి జిల్లా అధికారులు, గిరిజన, గురుకుల, మహాత్మా జ్యోతి భా పూలే, మోడల్ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, వసతి గృహ సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్
విద్యార్థుల సంఖ్య ,గైర్హాజరు శాతం, మౌలిక సౌకర్యాలు కల్పన, సిబ్బంది వివరాలు, మెనూ ప్రకారం భోజనం అందచేయుట  తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని గురుకుల, సంక్షేమ వసతి  గృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం,  మెరుగైన విద్య అందించాలని ఆదేశించారు.

Students should be provided with good education and food

ఎస్సి 11, బిసి 7, కెజిబివిలు 11, మోడల్ పాఠశాలలు 5, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల 1, గిరిజన సంక్షేమ 23, మైనార్టీ 9 నిర్వహించబడుతున్నాయని వాటిలో 8795 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నట్లు తెలిపారు. అన్ని సంక్షేమ
వసతి గృహాలల్లో
విద్యుత్ సరఫరా, తరగతి గదుల సంఖ్య, ఆర్.ఓ ప్లాంట్, సోలార్ వాటర్ హీటర్లు ప్రహారిలు,  మౌలిక వసతులు, భవనాలు, మంచి నీటి బోర్లు, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్, మురుగునీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు
వంటి  సమస్యల పరిష్కారానికి ప్రతి ప్రతిపాదనలు ఇవ్వాలని, అట్టి ప్రతిపాదనలు ఆధారంగా ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి అంచనా నివేదికలు తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వసతి గృహాలకు  సరఫరా చేయు నిత్యావసర సరుకుల్లో నాణ్యత ఉండాలని తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించు విధంగా  అవగాహన కల్పించాలని అన్నారు.   వంట చేయు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.  ఆహారాలను తనిఖీ చేయాలని ఎవరైనా విద్యార్థులు జ్వరాలు,  ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే  సంబంధిత వైద్య శాఖ అధికారులకు సమాచారం అందించి వైద్య సేవలు  అందించాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి  రాజేందర్, బీసీ, మైనారిటీ శాఖ అధికారి శైలజ, ఎస్సీ అభివృద్ధి  అధికారి సునీత,  గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్