- Advertisement -
విద్యార్దులు తెలివికి సాన పెట్టాలి
Students should be smart
సామర్లకోట
దేశానికి అవసరమైన వస్తు సంపద, సేవా సంపదలను అందించేందుకు విద్య అవసరమని, దానికి నేటితరం విద్యార్థులు కృషి చెయ్యాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సోషలిస్ట్ డా.జయప్రకాష్ నారాయణ్ అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట వై ఆర్ ఎల్ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో డా. జయప్రకాష్ నారాయణ్, ప్రముఖ వైద్యులు, రచయిత డా. ఆలూరి విజయలక్ష్మి లు విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా డా. జయప్రకాష్ మాట్లాడుతూ మనిషి ఒక జంతువు అయినా సృష్టిలో ఏ జంతువుకు లేని శరీర ఆకృతి, మేధస్సు మనిషికి మాత్రమే ఉందన్నారు. ఆ మేధస్సును పెంచుకునేందుకే విద్య అవసరం అన్నారు. విద్యాద్వారా సంపాదించిన మేధస్సును ధనార్జనకు గాక సమాజానికి మేలు జరిగే విధంగా ఉపయోగించాలన్నారు. సమాజంలో నూటికి 85 శాతం పిల్లలకు దేవుడు తెలివితేటలూ ఇచ్చినా వాటిని వినియోగించుకోలేక పోతున్నారన్నారు. విద్యార్థులంతా కులం, మతం, ప్రాంతం బాష అనే తారతమ్యాలను విడిచి పెట్టి తెలివికి సాన పెట్టి సమాజానికి ఉపయోగ పాడాలన్నారు. తాను ఒక మారుమూల గ్రామంలో పుట్టి జిల్లా పరిషత్ పాఠశాలలో చదివానన్నారు. పూర్వం పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్య నేర్పేందుకు ప్రాణం పెట్టేవారన్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనం అతి తక్కువగా ఉన్నా ఉపాధ్యాయుల పోషణ, పాఠశాల బాగోగులు గ్రామస్థులు చూసుకొనేవారన్నారు. ఆ పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. తాను ఎక్కడ మీలాంటి పిల్లలను చూసినా నా బాల్యన్ని గుర్తుచేసుకుంటానని జయప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మమేకమై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి పలు విషయాలపై అవగాహన కల్పించారు. దీనికి ముందు డా. విజయలక్ష్మి విద్యార్థులతో గడిపి పలు ఆరోగ్య సూచనలు అందజేశారు. తొలుత డా. విజయలక్ష్మి, డా. జయప్రకాశ్ నారాయణ్ లు జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అలాగే అనంతరం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం లోని శ్రీ వివేకానంద భవనంలో డా. జయప్రకాష్ నారాయణ్ విద్యార్థులతో ఇంటారాక్ట్ అయ్యి పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైఆర్ఎల్ కళాశాల చైర్మన్ డా. మాణిక్యం, డైరెక్టర్ రవిచంద్ర, ప్రిన్సిపాల్ లావణ్య, కరస్పాండెంట్ లక్ష్మిరాజ్యం, ఏఓ ఆకుల దుర్గా ప్రసాద్, వివేకానంద సమితి నాయకులు కంటిపూడి గోపాలకృష్ణ, సమితి నాయకులు, కళాశాల అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -