విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలి :కలెక్టర్ పమేలా సత్పతి
Students should continuously learn and move forward: Collector Pamela Satpathy
కరీంనగర్
విద్యార్థులు నిరంతరం క్రమశిక్షణతో నేర్చుకుంటూ తమకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకునేలా ముందుకు సాగాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ నిర్వాహకులు 8 కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్కారు బడుల్లో చదివి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ. విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
మన ఆర్థిక నేపథ్యాలు ఎలా ఉన్నా. చదువును నమ్ముకుని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ అశోక్, హెచ్ఎం రాజేందర్, ఫౌండేషన్ సభ్యులు సూర్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.