తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలి-జిల్లా ఎస్పీరావుల గిరిధర్
Students should grow to level that parents are proud of-Zilla Espiraoula Giridhar
మారకద్రవ్యాలతో నిర్వీర్యమవుతున్న యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
– యువత కఠోర సాధన చేసి ఉన్నత ఉద్యోగాలు సాదించాలి
యువత భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోని విజయం సాధించాలని, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించానుకుంటే నిబద్ధత కఠోర సాధన చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా మీ కలలను సాధించుకోవచ్చని, యువత తమ సమయాన్ని వృధా చేయకుండా కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్న ఉద్యోగాలను సాధింగలరని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో- ఎడ్యుకేషన్) వనపర్తి యందు సైబర్ సెక్యూరిటీ మరియు షీ- టీం అవేర్నెస్ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ రావు ఐపీఎస్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థిని, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్షంగా విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారి యొక్క లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రుల యొక్క కుటుంబ, ఆర్థిక ,స్థితిగతులను అవగాహన చేసుకోవాలన్నారు. రోడ్డు భద్రతలో భాగంగా మద్యం సేవించి గాని హెల్మెట్ లేకుండా గాని అతివేగంతోను, ట్రిపుల్ ట్రేడింగ్ వంటివి చేయవద్దన్నారు. మహిళా భద్రతకు పోలీస్ శాఖ తరపున ఎల్లవేళలా భద్రత కల్పించడానికి
షీ -టీం వాట్సాప్ గ్రూప్ నెంబర్ 6303923211 నెంబర్ కు సంప్రదించాలని, బాధితుల వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలియజేశారు.
మారకద్రవ్యాలు, డ్రగ్స్,గంజాయి ఇతర మత్తు పదార్థాల కారణంగా యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతున్నదని, దీనివల్ల దేశ అభివృద్ధి, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని చెప్పారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల యువత సైతం గంజాయి సేవించే స్థాయికి గంజాయి విక్రయాలు పెరిగాయని అందువల్ల క్షేత్రస్థాయి నుండి పోలీసు అధికారులు సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని అన్నారు. ఆధునిక కాలంలో వస్తున్న సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు సాగుతుండగా మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు, సెల్‌ఫోన్లకు, మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. పాఠశాల , కళాశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవ పడుతుండగా , వయసుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసం చెడు అలవాట్ల వైపు దారి మరలుతున్నారు. యువత అనవసరంగా చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. యువత కి విద్య, ఉద్యోగ ఉపాధిలో పోలీసులు ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుంది అన్నారు.
విద్యార్థులతో మత్తు పదార్థాలకు బానిస కాకూడదని అన్నారు
ఈ కార్యక్రమంలో వనపర్తి సిఐ, క్రిష్ణ , షీటీం ఎస్సై, అంజద్. కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్, మరియు లెక్చరర్స్ దాంసింగ్, వెంకట స్వామి, యాదగిరి గౌడ్, రామకృష్ణ మూర్తి, సునీత భాయ్, మల్లికార్జున్, రాఘవేంద్ర, రంజిత్, స్వప్న,నాగలక్మి, వెంకట స్వామి మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక మొత్తంలో హాజరయ్యారు.