- Advertisement -
త్వరలో మధిర లో సబ్ జైలు
Sub Jail in Madhira soon
ఇక ప్లాస్టిక్ రహిత జైళ్లు
హైదరాబాద్
తెలంగాణ జైళ్ల శాఖ వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా వివరించారు. చంచల్ గూడ లోని జైళ్ల శాఖ సికాలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు
చివరిసారిగా 2019 లో అన్యూల్ మీట్ ఏర్పాటు చేశాం.2024 లో జైల్ అదాలత్ లో 1045 లో అవకాశం కల్పించాం.2650 మంది ఖైదీలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను 213 మందిని విడుదల చేశాం. 2024 లో 8 మంది ఖైదీలకు బ్యాంక్ లోన్స్ ఇచ్చాం. జైల్లో ఉండి 750 మంది డిగ్రీ పూర్తి చేశారు. 225 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్ట పొందారు. జైల్లో ఉన్న ఖైదీల ద్వారా ఇంటికి అవసరమైన పరికరాలను ఖైదీలతో తయారు చేయించాం. ఖైదీల నుండి టైలరింగ్,ప్రింటింగ్ ప్రెస్ బేకరి యూనిటి,పౌల్ట్రీ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేశాం. జైల్లో ఉన్న ఖైదీలకు ఉపాధి కల్పనకు అవసరమైన జాతీయ చమురు కంపెనీలతో 29 అవుట్ లే అవుట్ లెట్ల ను ఏర్పాటు చేశాం. 2024 లో జైల్ శాఖలో 126 మందిని రిక్రూట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల శాఖలో 58 మందికి పదోన్నతులను కల్పించామని అన్నారు.
త్వరలో మధిర లో సబ్ జైల్ వస్తుంది. కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాల బుక్ ను తెలంగాణ జైళ్ల శాఖ నల్సార్ యూనివ్సిటీ సహకారంతో సిద్ధం చేశాం. నుమయిష్ ఎగ్జిబిషన్ లో మా స్టాల్ ఏర్పాటు చేశాం. గతంలో నుమయిష్ ఎగ్జిబిషన్ లో మా స్టాల్ కి అవార్డు వచ్చింది. జైల్లో ప్లాస్టిక్ రహిత జైల్ గా చేస్తున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్కు బానిసైన వారికి సెంటర్లో ఏర్పాటు చేశారు… హైదరాబాద్, చర్లపల్లి, సంగారెడ్డి,నిజామాబాద్ ,త్వరలోనే సెంటర్లో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో ఉన్న జైళ్లను మరమ్మత్తులు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని అన్నారు.
ఈ సమావేశంలో జైళ్ల శాఖ ఐజి లు రాజేష్ మురళీ బాబు. డీఐజీలు శ్రీనివాస్, పత్.జైలు సుపరిటెండేoట్లు శివకుమార్ గౌడ్, రామ చంద్రం, వెంకట లక్ష్మీ పాల్గొన్నారు
- Advertisement -