ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అక్టోబరు 5 నుంచి
హైదరాబాద్, సెప్టెంబర్ 4, (వాయిస్ టుడే): తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్ అసెస్‌మెంట్)-1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రాధా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు.
➥ సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలకు సంబంధించి ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
➥ అదేవిధంగా 6, 7వ తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, ఎనిమిదో తరగతికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ ఇక 9, 10 తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా విధ్యాధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
ఏడు పేపర్లతోనే పరీక్షలు..
ఈ ఏడాది 8, 9, 10 తరగతి విద్యార్థులకు మొత్తం ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలను రెండు పేపర్లుగా విభజించి ఒకేరోజు ఆ రెండు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నట్లు డైరెక్టర్ రాధా రెడ్డి తెలిపారు