Sunday, September 8, 2024

రంగంలోకి సునీల్ కనుగోలు

- Advertisement -

రంగంలోకి సునీల్ కనుగోలు
హైదరాబాద్, జనవరి 29
పార్ల‌మెంటు ఎన్నిక‌లపై టీ కాంగ్రెస్ వేగం పెంచింది. పార్ల‌మెంటు నియోజ‌వ‌ర్గాల వారిగా మంత్రులు రివ్యూలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయి ప‌రిస్ధితుల‌ను బేరీజు వేస్తున్నారు. ఇక సునిల్ క‌నుగోలు టీం సైతం రంగంలోకి దిగింది. సీఎం, మంత్రుల‌తో క‌నుగోలు బేటి అయ్యి పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత‌.. కాంగ్రెస్ ఎంపీ టికెట్లకు భారీ డిమాండ్ ఉంది. కాంగ్రెస్ టికెట్ల కోసం నేత‌లు పోటీలు ప‌డుతున్నారు.నియోజ‌వ‌ర్గాల వారీగా చూస్తే.. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థాన‌మైన వరంగల్ టికేట్ రేసులో అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాట సాంబ‌య్యల పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవ‌కాశం చివ‌రి నిమిషంలో చేజారిన అద్దంకి ద‌యాక‌ర్ వ‌రంగ‌ల్ నుంచి దించాల‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య‌, సీనియ‌ర్ నేత దొమ్మాట సాంబయ్య‌లు టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎస్పీ గా ప‌నిచేస్తున్న శోభ‌న్ కుమార్ టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.ఎస్సీ రిజ‌ర్వ‌డ్ స్థాన‌మైన నాగ‌ర్ కర్నూల్ సీటును మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి మల్లు రవి, టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చార‌కొండ‌ వెంకటేష్ పోటీ ప‌డుతున్నారు. ఎస్టీ స్థాన‌మైన ఆదిలాబాద్ నుంచి యువ నాయ‌కులు నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్ పోటీ ప‌డుతున్నారు. మరో ఎస్టీ స్థాన‌మైన మహబూబాబాద్ టికెట్ ను కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎస్టీ సెల్ చైర్మ‌న్ బెల్లయ్య నాయక్ ఆశిస్తుండ‌గా.. పోలీస్ ఆఫీసర్ కాశీరాం నాయక్ సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. జిల్లా ప‌రిష‌త్ మాజీ చైర్మ‌న్ ద‌న్వంతి నాయ‌క్ పేరు సైతం బ‌లంగా వినిపిస్తోంది.ఖమ్మం సీటును కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌద‌రి, ప్ర‌ముఖ వ్యాపార వెత్త వీ. రాజేంద్ర ప్రసాద్, మంత్రి పొంగులేటి సోద‌రుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ ఆశిస్తున్నారు. అయితే ఇక్క‌డ నుంచి సోనియా గాంధీని పోటి చేయాల‌ని టీపీసీసీ కోరుతుంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్ పేర్లు బ‌లంగా వినిప‌స్తున్నాయి. అయితే ఎంఐఎంకి చెక్ పెట్టేందుకు పాత బస్తీలో ప‌లుకుబ‌డి ఉన్న ఎంబిటితో పొత్తు పెట్టుకుని టికెట్ కేటాయించే అవ‌కాశాన్ని కాంగ్రెస్ ప‌రిశీల‌స్తోంది.కరీంనగర్ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీసీ సామాజిక వ‌ర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మ‌హిళా నేత‌ నేరెళ్ల శారద ఆశిస్తున్నారు. ఎస్సీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే గ‌డ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ ఎంపీ ఏ. చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డినిర్మాత దిల్ రాజ్ లు టికెట్ పోటీలో ఉన్నారు. క‌రీంన‌గ‌ర్ నుంచి సాధ్యం కాక‌పోతే..నిజామాబాద్ నుంచి బ‌రిలో నిల‌వాల‌ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యోచిస్తున్నారు. మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి ప్ర‌య‌త్నిస్తున్నారు. జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌కు దాదాపు ఖ‌రారు అయిన‌ట్లు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఆ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి సైతం ట్రై చేస్తున్నారు.మల్కాజిగిరి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, మేడ్చ‌ల్ టికెట్ చేజారిన హ‌రివ‌ర్ధ‌న్ రెడ్డి ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి బ‌రిలో నిలిచేందుకు చాలా మంది నేత‌లు పోటి ప‌డుతున్నారు. సికింద్రాబాద్ డీసీసీ ప్ర‌సిడెంట్ అనిల్ కుమార్ యాదవ్, వ్యాప‌రవేత్త వేణుగోపాల్ స్వామి, ఖైర‌తాబాద్ డీసీసీ ప్ర‌సిడెంట్ రోహిన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్ మాజీ మంత్రికి కేటాయించే అవ‌కాశాలున్న‌ట్లు ప్ర‌చారం జరుగుతోంది. అది వ‌ర్క్ అవుట్ కాని ప‌క్షంలో బడంగ్ పేట్ మేయ‌ర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు.మహబూబ్ నగర్ నుంచి ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత జీవన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నా రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారున్నారు. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కే టికెట్ ఖ‌రారు అయిన‌ట్లు ప్ర‌చారం జరుగుతోంది. చివ‌రి నిమిషంలో మార్పులు జ‌రిగితే సుర్యాపేట టికెట్ చేజారిన ప‌టేల్ ర‌మేష్ రెడ్డికి టికెట్ ద‌క్కే అవ‌కాశాలున్నాయి.ఇక‌ భువనగిరి టికెట్ కోసం టీపీసీసీ వైస్ ప్ర‌సిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కుటుంబ స‌బ్యులు టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. వ‌రంగ‌ల్ డీసీసీ మాజీ అధ్య‌క్షుడు జంగారెడ్డి, బీసీ కోటాలో ఉన్నా కైలాష్ నేతలు సైతం టికెట్ కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. ఇలా తెలంగాణ‌లోని అన్ని పార్ల‌మెంటు స్థానాల కోసం కాంగ్రెస్ లో టికెట్ల పోటీ తీవ్రంగా ఉంది. ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారుంటే.. సునీల్ క‌నుగోలు సర్వేల ఆదారంగానే టికెట్లు ఖ‌రారు చేస్త‌మంటున్నారు హ‌స్తం పెద్ద‌లు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్