22.1 C
New York
Friday, May 31, 2024

‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్*

- Advertisement -

*ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్*

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రజినీకాంత్ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.

ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే.  వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తారాగాణం : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్,  జీఎం సుందర్, రోహిణి, అభిరామి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!