16న నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

- Advertisement -

నగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు పెద్దాపూర్‌ పంప్‌హౌస్‌కు సంబంధించి 132 కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు చేపడుతున్న దృష్ట్యా ఈనెల 16న నగరంలో పలు రిజర్వాయర్ల పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. షేక్‌పేట, బోరబండ, లింగంపల్లి, ఖానాపూర్‌ రిజర్వాయర్ల పరిధిలో పూర్తిగా, ఎర్రగడ్డ, భోజగుట్ట రిజర్వాయర్ల ప్రాంతాల్లో పాక్షికంగా సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular