Friday, October 18, 2024

మున్నూరుకాపు కార్పొరేషన్ కు సహకరించే వారికే మద్దతు….

- Advertisement -
Support to those who cooperate with Munnurukapu Corporation….

తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపు కార్పొరేషన్ కు సహకరించే వారికే రానున్న ఎన్నికల్లో మున్నూరుకాపు సంఘ మద్దతు ఉంటుందని మున్నూరుకాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక కరెంట్ ఆఫీస్ లోని పింగళి హోండా షోరూమ్ నందు జరిగిన మున్నూరుకాపు సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్నూరుకాపు కులస్థులు ఆర్ధికంగా, రాజకీయంగా బలోపేతం కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపు కులస్తులు ఏ పార్టీ నుంచి పోటీ చేసిన వారిని గెలిపించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు మున్నూరుకాపు కార్పొరేషన్ కొరకు ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మున్నూరుకాపు భవనం కొరకు కొకపేటలో 5 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ కలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇల్లందు నియోజకవర్గ, గ్రామాల కమిటీలను పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరుకాపు కులస్తులు ఐక్యమత్యంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో మున్నూరుకాపులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా అణిచివేతకు గురవుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళా, యూత్, సీనియర్ సిటిజన్, ఉద్యోగులు, డాక్టర్లు, అడ్వకేట్స్ కమిటీలను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మున్నూరుకాపు కులస్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలిపి వాటి పరిష్కారిస్తామని హామీ ఇస్తారో స్పష్టం చేశాకే మదత్తు ఇవ్వాలని కోరారు. మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటైతే ప్రతి నియోజకవర్గానికి నిధులు కేటాయించడం సాధ్యమవుతుందన్నారు. మున్నూరుకాపు కులస్థుల పిల్లలు ఉన్నత చదువుల కొరకు విదేశాలకు, ఐఏఎస్, ఐపిఎస్ శిక్షణ కొరకు ఆర్ధికంగా సహకరించవచ్చని కోరారు. అనంతరం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈసమావేశంలో మున్నూరు కాపు సంఘ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రాజు, మున్నూరు కాపు సంఘ నాయకులు కోలా నర్సయ్య, కందుకూరి గణేష్, బండ్ల నకుల్, ఆది కోటేశ్వరరావు, ఇల్లందు నియోజకవర్గ, ఇల్లందు పట్టణ మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడుపింగళి నరేష్ చంద్ర, మున్నూరు కాపు కులస్తులు నాగేశ్వరరావు, కటకం పద్మావతి, రాజూరి మంజుల, కొక్కు సరిత, దిండిగల యాదిరెడ్డి, శేషు, పెద్దినేని రామకృష్ణ, రాజూరి వైశాక్, రాఘవరపు రాకేష్, కామిశెట్టి సైదులు, కామిశెట్టి దుర్గారావు, గూడ గోపాల్, పగడాల చందు, పెద్దినేని హరినాథ్ బాబు, పోతునూరి మాధవ్, మంద శంకరయ్య, వెన్నంపల్లి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్