ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షునిగా సురుగు శ్రీనివాస్ మాదిగ
జగిత్యాల,
ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా సురుగు శ్రీనివాస్ మాదిగ ఎన్నికయ్యారు. శనివారం
జిల్లా కేంద్రంలో జిల్లా ఇంచార్జి గంధమల నాగభూషణ్ అధ్యక్షతన జరిగిన ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా సమవేశంలో ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా సురుగు శ్రీనివాస్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధిగా బిరుదుల శ్రీను, ప్రధాన కార్యదర్శిగా మోకినపల్లి సతీష్, ఉపాధ్యక్షులుగా తడగొండ విజయ్, మోతే సురేష్, జగార్ల నరేష్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురుగు శ్రీనివాస్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా మాదిగల, ఉపకులాల హక్కుల కోసం పోరాడుతూనే, సమాజంలోని అన్ని వర్గాల పక్షాన నిలబడి పాలకులతో పోరాడుతూ సమాజానికి సంక్షేమ ఫలాలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణన్నదే అని అన్నారు. భవిషత్ లో మాదిగల పక్షాన నిలబడి మంద కృష్ణమాదిగ నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేస్తా అని అన్నారు. ఈ ఎన్నికకు సహకరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, జిల్లా ఇంఛార్జి గంధమల నాగ భూషణ్ మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు దుమాల గంగారాం మాదిగ, జగిత్యాల జిల్లా కమిటీ కి ధన్యవాదాలు తెలిపారు.



