సీసీఆర్ పోరాట ఫలితమే వైద్యుల సస్పెన్షన్

- Advertisement -

సీసీఆర్ ఫౌండర్ అనీల్ కుమార్

జగిత్యాల:  అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాడే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్(సీసీఆర్) పోరాట ఫలితమే ఓ మహిళ కడుపులో గుడ్డ పేలుక మరిచి కుట్లువేసిన సంఘటనలో డాక్టర్ల తోపాటు నర్సింగ్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడిందని సీసీఆర్ ఫౌండర్ అనీల్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఒక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో అనీల్ మాట్లాడారు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో గతంలో ఆసుపత్రి వైద్యురాలు, నర్సింగ్ స్టాఫ్ నిర్లక్ష్యంతో ఆపరేషన్ చేసిన మహిళ కడుపులో గుడ్డ పేలికను మరిచిపోయి కుట్లు వేసిన సంఘటనపై సీసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేశామన్నారు. ఇబ్బందులకు గురైన మహిళకు న్యాయం చేయాలని, వైద్యులపై, సిబ్బందిపై చర్యలు చేపట్టాలని సీసీఆర్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కు, వైద్య ఆరోగ్య కమిషనర్లను ఫిర్యాదు చేశామన్నారు. మా ఫిర్యాదులకు స్పందించిన వైద్య విధాన కమిషనర్ ఆసుపత్రి డాక్టర్ శిరీష, ఉమా కవిత, స్టాఫ్ నర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారిచేశారని అనీల్ పేర్కొన్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రంజిత్ ను తొలగించాల్సిందిగా సంబంధిత ఏజన్సీకి ఆదేశాలు జారిచేశారన్నారు. అవినీతి అంతం సీసీఆర్ పంతం అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అనీల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సెంట్రల్ కమిటీ మెంబర్ బూక్యా చరణ్ కాంత్, జోనల్ కమిటీ మెంబర్ నెవూరి రత్నాకర్, జగిత్యాల జిల్లా సిసిఆర్ సంస్థ సభ్యులు తాలూకా మల్లేష్, బొల్లి లక్ష్మణ్, చుక్క గంగాధర్, ముస్కు అభిషేకర్ రెడ్డి, అంకం భూమయ్య, తేలుకంటి గంగాధర్, తుమ్మనపల్లి జయప్రకాశ్ రెడ్డి, కిషన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular