Saturday, February 15, 2025

స్వర్ణాంధ్ర 2047 విజన్ ఆవిష్కరణ

- Advertisement -

స్వర్ణాంధ్ర 2047 విజన్ ఆవిష్కరణ

Swarna Andhra 2047 Vision Invention

విజయవాడ, డిసెంబర్ 13, (వాయిస్ టుడే)
వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఏపీ సాకారమే లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రులు పాల్గొన్నారు. ‘పది సూత్రాలు.. ఒక విజన్’ పేరిట ‘స్వర్ణాంధ్ర @ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను శుక్రవారం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇది జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు.స్వర్ణాంధ్ర విజన్ 2047.. రాష్ట్ర దిశ, దశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది. వైసీపీ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలపాలనే సంకల్పంతో ఉన్నాం. నేడు 3 వేల డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి 42 వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నదే లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలం.’ అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విజన్ 2047లో భాగంగా ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం.. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారుకావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. పీ4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నాం. ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి.. మానవ వనరులను అభివృద్ధి చేస్తాం. నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే కరవు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నాం. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్‌లో చేర్చాం.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్