- Advertisement -
స్వామి అమ్మవార్లకు ఊయల సేవ
Swing service for Swami's Ammavaru
శ్రీశైలం
లోకకల్యాణం కోసం దేవస్థానం శుక్రవారం సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించారు.
ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరిపించ బడుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడుతుంది.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించబడుతుంది. తరువాత చివరగా ఊయలసేవ నిర్వహించబడుతుంది.
ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడుతాయి..
పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించడం జరుగుతుంది.
- Advertisement -