Thursday, November 7, 2024

హైదరాబాద్ లో ఠాగూర్ ట్రీట్మెంట్

- Advertisement -

హైదరాబాద్ లో ఠాగూర్ ట్రీట్మెంట్

Tagore Treatment in Hyderabad

హైదరాబాద్, నవంబర్ 7, (వాయిస్ టుడే)
ఠాగూర్ సినిమాను ఎవరూ మరిచిపోరు. చనిపోయిన శవానికి ఎన్ని డబ్బులైనా ఇస్తాం బతికించుమంటే కార్పొరేట్ ఆస్పత్రి చేసిన నిర్వాకాన్ని మన చిరంజీవి కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇప్పుడే అదే సీన్ హైదరాబాద్ లో రిపీట్ అయ్యింది
సినిమాను ఎవరూ మరిచిపోరు. చనిపోయిన శవానికి ఎన్ని డబ్బులైనా ఇస్తాం బతికించుమంటే కార్పొరేట్ ఆస్పత్రి చేసిన నిర్వాకాన్ని మన చిరంజీవి కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇప్పుడే అదే సీన్ హైదరాబాద్ లో రిపీట్ అయ్యింది. జూనియర్ వైద్యురాలి ప్రాణం తీసింది. ఆమె తరుఫు వారు డబ్బులు కట్టకుంటే చికిత్స ఆపేసి అనంతరం చనిపోయినా కూడా బతికి ఉందని నాటకమాడి లక్షలు గుంజేసిన ఓ ఆస్పత్రి దారుణం వెలుగుచూసింది. పైసలు పీక్కుతునే ఈ కార్పొరేట్ ఆస్పత్రుల ఆగడాలు మరోసారి ఓ కుటుంబాన్ని చిదిమేశాయి.శవాలతోనూ పైసలు సంపాదించడం అంటే ఇదేనేమో. ఓ వైపు బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని చూసి జాలి చూపాల్సింది పోయి.. మిగిలిన డబ్బు కట్టి శవాన్ని తీసుకువెళ్లండని చెప్పడం ఆందోళనకు దారితీసింది. హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కార్పొరేట్ ఆసుపత్రుల్లో పరిస్థితులను మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది. అనారోగ్యానికి గురైన జూనియర్ డాక్టర్ నాగప్రియను ఆమె కుటుంబసభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. అప్పటికే ఆమెకు ట్రీట్మెంట్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా రూ.4 లక్షలు బిల్లు పెండింగ్‌లో ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆ డబ్బులు కట్టిన తరువాతనే డెడ్ బాడీ ఇస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. దీంతో బాధితులు ఎమ్మెల్యే గాంధీతో చెప్పించారు. అయినప్పటికీ ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోలేదు.అయితే.. ముందు రోజు అర్ధరాత్రి ఫోన్ చేసి రూ.మూడు లక్షలు కట్టాలని, లేదంటే ట్రీట్మెంట్ నిలిపివేస్తామంటూ ఆస్పత్రివర్గాలు నాగప్రియ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపాయి. ఉదయాన్నే వారు అలా ఇలా సమకూర్చి మరో లక్ష పే చేశారు. కానీ.. ఆ తరువాత నాగప్రియ చనిపోయింది. మిగతా డబ్బు అంటూ ఆస్పత్రి వర్గాలు బెట్టు వీడలేదు. ఆ డబ్బులు చెల్లించాకనే శవాన్ని ఇస్తామని ఖరాఖండిగా చెప్పారు. అయితే.. తమ కూతురికి వైద్యం చేయడం ఆపేయడం వల్లనే చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్