- Advertisement -
జంపు జిలానీలపై చర్యలు తీసుకోండి
చంద్రబాబునాయుడు
అమరావతి
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు చంద్రబాబు తన అభిప్రాయం పంపారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి లను అనర్హులు గా ప్రకటించాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాల వీరాంజనేయస్వామి ఇచ్చిన అనర్హత పిటిషన్ పై పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయాన్ని శాసన సభ స్పీకర్ కోరారు.
పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని….చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు బదులిచ్చారు. గురువారం నాడు ఈ రోజు తన అభిప్రాయాన్ని స్పీకర్ కు పంపారు.
- Advertisement -