ఎంపీ వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి
Take action against the person who made inappropriate comments on MP Vamsikrishna
గోదావరిఖని
వాట్సప్, ఫేస్ బుక్, సోషల్ మీడియా ద్వారా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంచిర్యాల నివాసి, టీబీజీకెఎస్ లీడర్ గోగుల రవీందర్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లీడర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ భూమేష్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. దశాబ్ధాల కాలంగా ప్రజా సేవకు అంకితమైన దళిత నేత, దివంగత కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు, ఆయన మనవడైన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణను అకారణంగా సోషల్ మీడియా వేదికగా ఆయన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా రవీందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టరీత్యా తగు చర్య తీసుకోవాలని లీడర్లు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల గోవర్ధన్ రెడ్డి, సీనియర్ లీడర్లు పి.మల్లికార్జున్, బోయిని మల్లేష్ యాదవ్, నర్సింగ్ దొర, కామ విజయ్, తిప్పారపు మధు, రఫీక్, హకీమ్, తదితరులు పాల్గొన్నారు.