దోమల లార్వాలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోండి-కమిషనర్ ఎన్.మౌర్య
Take measures to prevent the growth of mosquito larvae-Commissioner N. Mauryaతిరుపతి
వర్షాలకు నగరంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు.
గురువారం నగరంలో అక్కారంపల్లి, కొర్లగుంట, తదితర ప్రాంతాల్లో మురునీటి కాలువలను పరిశీలించి ఆయిల్ బాల్స్ వేయించే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడ నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్ద డ్రైనేజి కాలువల్లో చెత్త తొలగించడం వలన వర్షపు నీరు కొంతమేర సజావుగా వెళుతున్నాయని అన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం మురుగు కాలువల్లో నీరు రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. అవి కూడా రాకుంద ఇంజినీరింగ్ అధికారులు, హెల్త్ అధికారులు కలసి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతిరోజు కాలువల్లో, ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు పనులు చెపట్టాలని అన్నారు. పాడైన డ్రైనేజి కాలువలకు మరమ్మత్తులు చేపట్టెందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్కారంపల్లి చివర మురుగునీరు ఆగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ.రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, సర్వేయర్ కోటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.




