Tuesday, January 14, 2025

తమ్మినేని దారెటు…

- Advertisement -

తమ్మినేని దారెటు…

Tammineni route where...

శ్రీకాకుళం, జనవరి 8, (వాయిస్ టుడే)
ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు తమ్మినేని సీతారాం. ఇప్పటి వరకు 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. వైసీపీ సర్కార్‌లో శాసన సభాపతిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో తలపండిన నేతగా పేరు తెచ్చుకున్నారు తమ్మినేని.. అలాంటి సీనియర్ నేతను ఇప్పుడు సోషల్ మీడియా ముప్పుతిప్పలు పెడుతుందనే గాసిప్ మొదలైంది.ఎంత అనుభవం ఉన్నా కాలం కలిసి రాకుంటే. ఎవరైనా డీలా పడాల్సిందే. అలా వైసీపీ ఓటమి తర్వాత తమ్మినేని కూడా ఇబ్బందులుపడుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఓటమి తర్వాత సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా చింతాడ రవికుమార్‌ని నియమించారు.ఇక అప్పటి నుంచి తమ్మినేనితో పాటు ఆయన వర్గం అసంతృప్తిగా ఉన్నారనే టాక్ లోకల్‌లో రీసౌండ్ చేస్తోంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరిగినా.. ఎక్కడా తమ్మినేని కనిపించడం లేదు. ఆమదాలవలస వైసీపీ పగ్గాలను తమ్మినేని వారసుడు వెంకట చిరంజీవి నాగ్‌కి అప్పగిస్తారని లోకల్‌లో తెగ ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో అధిష్టానం చిరంజీవినాగ్‌ను కాదని చింతాడ రవికుమార్‌కు బాధ్యతల్ని అప్పగిచారు. దీంతో అప్పటి నుంచి వైసీపీ అధిష్టానంపై తమ్మినేని కుటుంబం కాస్త గుర్రుగానే ఉందని గాసిప్‌ వినిపిస్తోంది.సోషల్ మీడియా వచ్చి దూరం అనే మాటను చెరిపేసింది. ప్రపంచాన్ని సింగిల్‌ విలేజ్‌గా మార్చేసింది. ఎక్కడా ఏ మూలనా ఏం జరిగినా ప్రపంచమంతా చాటి చెబుతుంది. ఈ సోషల్ మీడియా ఓడలను బండ్లను చేయగలదు. బడ్లను ఓడలను చేయగలదు. చాలా మంది సోషల్‌ మీడియాను బ్రహ్మాస్త్రంగా వాడుకొని పొలిటికల్ లీడర్లుగా ఎదిగిపోయారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నిజాన్ని అబద్ధం డామినేట్ చేస్తోంది. సత్యం డిలేట్ అయిపోయి అసత్యం ఫార్వర్డ్ అవుతుంది. ఇలా ఇప్పటి వరకు ఎంతోమంది నేతలు చిక్కుల్లో పడ్డారు.ఇది ఇలా సాగుతుంటే రెండు నెలలుగా వైసీపీ క్యాడర్‌కి సైతం తమ్మినేని టచ్‌లోకి రావడం లేదట. నిజం చెప్పాలంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అనే అనుమానం లోకల్‌ కార్యకర్తలకు కూడా కలిగింది. ఇక్కడే తమ్మినేనికి అసలు చిక్కువచ్చి పడింది. సీతారాం పార్టీ మారబోతున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఒక్క అడుగు ముందుకేసి.. తమ్మినేని జనసేన వైపు చూస్తున్నారని కొందరు.. లేదు లేదు బీజేపీ ఆఫీస్‌ బాట పడతారని ఇంకొందరి తమ్మినెయిల్ తగిలించి  వీడియోలు వదిలేశారు. ఇక ఆ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. తమ్మినేని కూడా టచ్‌లో లేకపోవడంతో వైసీపీ క్యాడర్ కూడా ఇదే నిజమే అని ఫిక్స్ అయ్యారట.రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సిక్కోలు జిల్లాకు ఎంట్రీ ఇచ్చిన సీతారాం.. సోషల్ మీడియా ప్రచారం చూసి షాక్ ఐపోయారు. తానేంటి పార్టీ మారడం ఏంటని తల పట్టుకుంటున్నారట. ఇంతలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆమదాలవలసలో సీతారాం ఇంటికి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే అనుమానం మరింత బలపడింది. తమ్మినేని పార్టీ మారబోతున్నారని.. ఆయన్ని బుజ్జగించేందుకే స్వయంగా బొత్స వచ్చారంటూ సిక్కోలు పొలిటికల్ సర్కిళ్లలో పుకార్లు షికార్లు చేశాయి.తాను పార్టీ మారడం లేదు మహా ప్రభో అంటూ తమ్మినేని క్లారిటీ ఇచ్చేశారు. తన కుమారుడి ఆపరేషన్ కోసం వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిం వచ్చిందని వివరణ ఇచ్చారు. అందుకే పార్టీ క్యాడర్‌కి టచ్‌లోకి రాలేదని చెప్పుకువచ్చారు. పీకపోయినా ఎవరైనా పవన్‌కల్యాణ్ వైపు వెళ్తారా అంటూ వివరణ కూడా ఇచ్చారట. ఇటు బొత్స సత్యనారాయణ కూడా తమ్మినేని కుమారుడి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికే వచ్చానని చెప్పుకువచ్చారు.తమ్మినేని మనసులో ఏముందో గాని.. సోషల్ మీడియా మాత్రం ఆయనికి కంటిమీద కునుకులేకుండా చేసింది. వైసీపీ క్యాడర్‌నే నమ్మించేంతలా ప్రచారాన్ని ఊదర గొట్టింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదనే ప్రచారం మళ్లీ మొదలైంది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో సోషల్‌ మీడియా అంచనాలు తలకిందులవుతాయా. లేదంటే నిజమే అవుతాయా.? అన్నది కాలమే నిర్ణయించాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్