Wednesday, December 18, 2024

తండేల్ శివ శక్తి పాట డిసెంబర్ 22న కాశీలోని డివైన్ ఘాట్స్ లో లాంచ్

- Advertisement -

తండేల్ శివ శక్తి పాట డిసెంబర్ 22న కాశీలోని డివైన్ ఘాట్స్ లో లాంచ్

Tandel Shiva Shakti song launch on 22nd December at Divine Ghats, Kashi

అల్లు అరవింద్ ప్రెజెంట్స్- నాగ చైతన్య, సాయి పల్లవి, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ – తండేల్ శివ శక్తి పాట డిసెంబర్ 22న కాశీలోని డివైన్ ఘాట్స్ లో లాంచ్

యువ సామ్రాట్ నాగ చైతన్య హైలీ యాంటిసిపేటెడ్ మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు, ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి ఇప్పటికే 30 M+ వ్యూస్ తో అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.
ఈరోజు, మూవీ సెకండ్ సింగిల్-శివశక్తిని డిసెంబర్ 22న కాశీలోని డివైన్ ఘాట్స్ లో లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే ఈ పాట సంగీతపరంగా, విజువల్ గా అద్భుతంగా వుండబోతోంది. పండుగను అత్యంత వైభవంగా జరుపుకునే అనుభూతిని అందిస్తామని మేకర్స్ వాగ్దానం చేశారు. ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
శివ శక్తికి సంబంధించిన పోస్టర్ నాగ చైతన్య, సాయి పల్లవి పవర్ ఫుల్ శివ శక్తి ఫోజ్ లో కనిపించడం ఆకట్టుకుంది. చుట్టూ పెద్ద సంఖ్యలో జనసమూహం, వారి సంప్రదాయ వస్త్రధారణ జాతర ఉత్సాహపూరిత వాతావరణం పాట యొక్క ఆధ్యాత్మిక ఇతివృత్తానికి జీవం పోస్తాయి. ఈ పాటను భారీ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో చిత్రీకరించారు, ఇది ఇప్పటివరకు నాగ చైతన్య కు మోస్ట్ ఎక్సపెన్సీవ్ ట్రాక్‌గా నిలిచింది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్.
తండేల్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్