Tuesday, April 29, 2025

పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్ ద్వారా యువ సామ్రాట్ నాగ చైతన్యకు బర్త్ డే విషెస్ తెలిపిన తండేల్ టీం

- Advertisement -

పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్ ద్వారా యువ సామ్రాట్ నాగ చైతన్యకు బర్త్ డే విషెస్ తెలిపిన తండేల్ టీం

Tandel Team Wishes Young Emperor Naga Chaitanya Through Power Packed Action Poster

యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ ఫిల్మ్ తండేల్ హ్యుజ్ బజ్ సృష్టిస్తోంది. ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి విడుదలైన తర్వాత ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచి, ఇన్స్టంట్ హిట్ అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి జోడిగా కనిపించిన బుజ్జి తల్లి మెలోడిక్ మాస్టర్ ఫీస్ గా నిలిచి, సినిమా మ్యూజికల్ జర్నీకి చార్ట్‌బస్టర్ టోన్‌ని సెట్ చేసింది.
నాగ చైతన్య ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నాగ చైతన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తండేల్ మేకర్స్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చేతిలో బరువైన యాంకర్‌ను పట్టుకుని,  వర్షపు తుఫాను మధ్య ఓడపై నాగ చైతన్య నిలబడి కనిపించారు, అతని ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్, పవర్ ఫుల్ ప్రజెన్స్ దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.
నాగ చైతన్య పొడవాటి జుట్టు, మ్యాసీ గడ్డంతో రగ్గడ్ అవతార్ లో కనిపించారు. తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో అభిమానులను ఆకట్టుకోవడం ఖాయం. నాగ చైతన్య తండేల్ రాజు పాత్రను పోషించిన విధానం ఇండియన్ సినిమాలో చిరకాలం గుర్తుండిపోతుంది.
అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందించారు. షామ్‌దత్  డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
ఫిబ్రవ‌రి 7న తండేల్ సినిమా గ్రాండ్ గా విడుద‌ల‌వుతుంది.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్