Sunday, September 8, 2024

తెలంగాణ ఎన్నికలలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 19, (వాయిస్ టుడే):  తెలంగాణలో హంగ్ ఖాయం బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు చెప్పారు. హంగ్ వస్తే  బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే.. కూటమిలో భాగం అవడం ద్వారా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఎన్నికలకు ముందు పొత్తులుంటాయా.. ఎన్నికల తర్వాతనా అనే దానిపై చర్చలు ప్రారంభమయ్యాయి.  ఎన్డీఏలోకి చంద్రబాబు చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెబుతూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. చివరికి బీజేపీతో పొత్తులకు సమయం మించిపోయిందన్నారు. ఏపీ అధికార పార్టీ  వైసీపీతో బీజేపీ సన్నితంగా ఉంటోంది.  ఆ రెండు పార్టీలు దగ్గరగా లేవని చెప్పడానికి .. నిరూపించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత షరతులు పెట్టారన్న ప్రచారం జరిగింది.  కానీ వైసీపీ కి పార్లమెంట్ లో ఉన్న బలం రీత్యా..  బీజేపీ విమర్శలకే పరిమితయింది కానీ.. యాక్షన్ లోకి దిగలేదు. ఈ లోపు తెలంగాణ ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఎన్టీఆర్ వంద నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం సమయం మించిపోయిందన్నారు. అంటే..

TDP, BJP, Jana Sena alliance in Telangana elections
TDP, BJP, Jana Sena alliance in Telangana elections

తెలంగాణలో పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. నిజానికి రాజకీయ పార్టీల పొత్తునకు సమయం లేకపోవడం అనే ప్రశ్నే ఉండదు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు అయితే.. ఆ రోజు కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంటారు.కానీ చంద్రబాబు సమయం మించిపోయిందని చెప్పారంటే. బీజేపీతో పొత్తు ఆయనకు ఇష్టం లేదన్నమాట.   ఎన్డీఏలోనే ఉన్నానని రోజుకో సారి ప్రకటన చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడలేదు. తమ పార్టీ పోటీ చేస్తుందని 32 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు. ఇవన్నీ దాదాపుగా సెటిలర్లు ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు. ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించారు కానీ.. తెలంగాణలో టీడీపీ గురించి ఆలోచించలేదు. అలాగే ఎన్డీఏలో ఉన్నామని  చెబుతున్నా… బీజేపీ గురించి ఆలోచించలేదు.  ఏకపక్షంగా తాము ఆ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.  ప్రకటన తర్వాత కూడా  బీజేపీ నేతలు స్పందించలేదు.చంద్రబాబు అరె్స్టు తర్వాత తెలంగాణ టీడీపీ నేతలు రిలాక్స్ అయ్యారు కానీ.. టీడీపీ సానుభూతిపరులు యాక్టివ్ అయ్యారు. చంద్రబాబుపై నిద్రాణంగా ఉన్న అభిమానం ఒక్క సారిగా తెరపైకి వచ్చింది. ర్యాలీలు చేయడం ప్రారంభించారు.  చంద్రబాబనాయుడు అరెస్ట్ తర్వాత ఐటీ ఉద్యోగుల ర్యాలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. దీంతో మరింత పట్టుదలకుపోయిన ఉద్యోగులు ర్యాలీలు చేశారు. ఆ ర్యాలీలు సెటిలర్లు ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకూ సెటిలర్లు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఈ పరిణామంతో వారు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో సెటిలర్లు బీఆర్ఎస్‌కు తప్ప ఎవరికైనా ఓటు వేయమని పిలుపునిస్తున్నారు.బీజేపీ ఒంటరిగా వెళ్లడం కన్నా   జనసేన , టీడీపీ కలిస్తే మంచిదని ఆ పార్టీ నేతలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు.  బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న వర్గాలు తమ వైపు చూస్తారని   గట్టి నమ్మకంతో ఉన్నారు. ఒక వేళ ఆ సెటిలర్ల ఓట్లు తారుమారు అయితే.. హంగ్ ఖాయంగా రావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కీలకం అవుతుంది. అదే జరిగితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా..  బీఆర్ఎస్ కలిసి ఏర్పాటు చేయాలనుకున్నా..క్షణాల్లో చేసేయగలదు. అందుకే పొత్తులపై కొత్త చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై మరో వారంలో అందరికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్